Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రంగ‌స్థ‌లం' గురించి క్లారిటీ ఇచ్చేసిన సుక్కు

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న క్రేజీ మూవీ రంగ‌స్థ‌లం. ఈ సినిమా 1985 టైమ్‌కి సంబంధించిన‌ది అని చెప్పారు కానీ… కాన్సెప్ట్ ఏమిటి అనేది మాత్రం రివీల్ చేయ‌లేదు. అయితే… రంగ‌స్థ‌లం రాజ‌కీయ నేప‌థ్యం

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (13:04 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న క్రేజీ మూవీ రంగ‌స్థ‌లం. ఈ సినిమా 1985 టైమ్‌కి సంబంధించిన‌ది అని చెప్పారు కానీ… కాన్సెప్ట్ ఏమిటి అనేది మాత్రం రివీల్ చేయ‌లేదు. అయితే… రంగ‌స్థ‌లం రాజ‌కీయ నేప‌థ్యంతో సాగే క‌థ అంటూ ప్ర‌చారం మొద‌లైంది. ఇది నిజ‌మో కాదా అనే సందేహం ఉండేది. ఇప్పుడు ఈ సందేహాల‌కు క్లారిటీ ఇస్తూ.. ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు డైరెక్ట‌ర్ సుక్కు.
 
రంగస్థలం సినిమా నుంచి ఆది పినిశెట్టి పోస్ట‌ర్ అది. ఈ ఒక్క ఫొటో చాలా విషయాల్ని చెప్పేసింది. మరీ ముఖ్యంగా రెండు విషయాలపై క్లారిటీ ఇచ్చింది. వీటిలో ఒకటి రంగస్థలం అనేది ఓ గ్రామం అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. మ‌రొక‌టి పొలిటికల్ టచ్ ఉంటుందనే విషయంపై కూడా తాజా పోస్టర్‌తో క్లారిటీ వచ్చేసింది. 
 
ఆది కుమార్ బాబు పాత్రలో, లాంతరు గుర్తుపై ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న‌ స్టిల్ అది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన 3 కీలకమైన క్యారెక్టర్లను పరిచయం చేసినట్టయింది. రామలక్ష్మిగా సమంత, చిట్టిబాబుగా చరణ్, కుమార్ బాబుగా ఆది ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ స్టిల్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. మ‌రి... రంగ‌స్థ‌లం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆప్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం - 600 మంది వరకు మృత్యువాత

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం: 622కి పెరిగిన మృతుల సంఖ్య, వెయ్యి మందికి గాయం

Chandrababu Naidu: సీఎంగా చంద్రబాబు 30 సంవత్సరాలు.. ఇంట్లో నాన్న-ఆఫీసులో బాస్ అని పిలుస్తాను

National Nutrition Week: జాతీయ పోషకాహార వారం.. ఇవి తీసుకుంటే?

ఇంటిలోని దుష్టశక్తులు పోయేందుకు మవనడిని నర బలిచ్చిన తాత...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments