విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సుకుమార్ ఫిక్స్‌

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (14:06 IST)
suku, vijay
ప్ర‌స్తుతం క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ద‌ర్శ‌కుడు సుకుమార్ సినిమా తీస్తున్నాడ‌నీ కాక‌పోతే అది ఆగిపోయింద‌ని వార్త‌లు గ‌త కొద్దిరోజులుగా సోష‌ల్‌మీడియాలో వ‌స్తున్నాయి. అదంతా ఫేక్ న్యూస్ అని అందులో ఎటువంటి నిజం లేద‌ని చిత్ర నిర్మాణ సంస్థ తెలియ‌జేస్తూ సోమ‌వారంనాడు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.
 
ఫాల్‌కాన్ క్రియేష‌న్ ఎల్‌.ఎల్‌.పి. బేన‌ర్‌పై ఈ చిత్రం రూపొందించ‌‌బోతోంది. 2022లో ఈ చిత్రం సెట్‌పైకి వెళ్ళ‌నుంది. ప్ర‌స్తుతం సుకుమార్ `పుష్ప‌` సినిమా పూర్తిచేశారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌నులు ముగింపు ప‌నుల్లో ఆయ‌న బిజీగా వున్నారు. అనంత‌రం విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చూడనున్నార‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్‌` అనే సినిమా చేస్తున్నాడు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప‌లు భాష‌ల్లో రూపొందుతోంది. ముంబైలో ఎక్కువ శాతం షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతంగా వుండ‌గా ఆ ప‌నులు కూడా కాస్త మంద‌గించాయి. అవ‌న్నీ స‌ర్దుకుని మ‌ర‌లా ఈ ఏడాదిలోగా సినిమాను పూర్తి చేసి విడుద‌ల చేయ‌నున్నారు.
 
ఇక సుకుమార్ సినిమా విష‌యానికి వ‌స్తే, పుష్ప త‌ర్వాత ఆయ‌న చేయ‌బోయే సినిమాకూడా ఇదే. మ‌రో సినిమాకు ఆయ‌న క‌మిట్‌కాలేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా లైగ‌ర్ త‌ర్వాత త‌మ సినిమానే చేయ‌నున్నాడ‌ని ఫాల్‌కాన్ సంస్థ తెలియ‌జేస్తుంది. పాన్ ఇండియా సినిమాగా దీన్ని రూపొందించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ పేరును ముష్టి ఎత్తుకోకపోతే మీకు పాపులారిటీ రాదు: సినీ నటి మాధవీలత షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ మామిడి వారసత్వాన్ని కొనియాడిన ప్రధాని మోదీ

అదృశ్యమైన 11 గంటల్లోనే నాలుగేళ్ల బాలుడిని కాపాడిన పోలీసులు

సంగారెడ్డి జిల్లా దారుణం : మహిళను పొదల్లోకి ఈడ్చుకెళ్లి భర్త కళ్లముందే హత్య

Pawan Kalyan: సేన గళం అనే కమిటీ ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై బ్లాక్ కిస్‌మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

తర్వాతి కథనం
Show comments