Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని సరసన నజ్రియా.. 'అంటే సుందరానికీ'..? (video)

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (13:56 IST)
Nazriya Nazim
తమిళ, మలయాళ నటి నజ్రియా నజీమ్ గురించి.. రాజా రాణి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే. ఈమె హీరోయిన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అంతేకాకుండా మలయాళంలో టీవీ ఛానల్ లో వ్యాఖ్యాతగా కూడా పనిచేసింది. అంతేకాకుండా ఈమెకు ఎంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది నజ్రియా.
 
2006లో బాలనటిగా మలయాళం సినిమాలు పరిచయం కాగా.. ఆ తర్వాత మలయాళం సినిమాతోనే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అంతే కాకుండా 2013లో తమిళం సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించి.. తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది. అంతే కాకుండా ఎన్నో ఉత్తమనటి అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో నటించకపోగా రాజా రాణి డబ్బింగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
 
ఇక ఈమె ప్రస్తుతం ఓ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'అంటే సుందరానికీ' అనే సినిమాలో నాచురల్ స్టార్ నాని సరసన నజిరియా హీరోయిన్ గా నటించనుంది. ఇక ఈ సినిమాలో ఓ ప్రాజెక్టు కోసం ప్రస్తుతం బృందం హైదరాబాద్‌ ఉండగా.. ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకుంది నజ్రియా.
 
తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో.. కొన్ని విషయాలు అభిమానులతో పంచుకుంది. అందరికీ నమస్కారం అంటూ, తన ఈరోజు తన మొదటి తెలుగు సినిమా షూటింగ్ లో అడుగు పెడుతున్నానని తెలిపింది. తొలి అనుభవం ఎప్పుడు ప్రత్యేకమైనదే అంటూ, అంటే సుందరానికి అనే సినిమాని కి తనకు ఎప్పుడూ ప్రత్యేకమే అని కొన్ని విషయాలు పంచుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments