Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్ బాబు చిత్రం మా నాన్న సూపర్ హీరో

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (08:37 IST)
Sudhir Babu
హీరో సుధీర్ బాబు తన సినిమాల కోసం విభిన్నమైన సబ్జెక్ట్‌లను ఎంచుకోవడంలో తన విలక్షణత చూపిస్తున్నారు. ఒక్కో సినిమా భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఒక యూనిక్ కథతో కంటెంట్-రిచ్ మూవీ చేస్తున్నారు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సిఏఎం ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఫాదర్స్ డే ప్రత్యేక సందర్భంగా మేకర్స్ సినిమా టైటిల్‌ను విడుదల చేశారు. 'మా నాన్న సూపర్‌ హీరో'అనే ఆకట్టుకునే టైటిల్ ని లాక్ చేశారు.
 
తండ్రి, కొడుకుల ప్రేమ, అనుబంధం యొక్క నిజమైన అర్థాన్ని తెలియజేసి సోల్ ని కదిలించే అద్భుతమైన ప్రయాణంగా ఈ చిత్రం వుండబోతుంది. తండ్రీకొడుకులు ఒంటరిగా రోడ్ ట్రిప్‌లో కనిపించిన టైటిల్ పోస్టర్ మనసుని హత్తుకుంటుంది. బోర్డు లాటరీ టికెట్ నంబర్, విన్నర్ ప్రైజ్ మనీ చూపిస్తోంది.
 
స్టార్ తారాగణం నటిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన ఆర్నా కథానాయికగా నటిస్తోంది. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి సపోర్టింగ్ రోల్స్ పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సమీర్ కళ్యాణి కెమెరామెన్ గా పని చేస్తున్నారు. జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ కుమార్ పి ఎడిటర్. మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకరతో పాటు ఎంవీఎస్ భరద్వాజ్, శ్రవణ్ మాదాల ఈ చిత్రానికి రైటర్స్. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రాజు సుందరం మాస్టర్‌.. కొరియోగ్రాఫర్‌గా కూడా పని చేస్తున్నారు.  
 
ఈ మాన్సూన్ లో సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు.
 
తారాగణం: సుధీర్ బాబు, ఆర్ణ, సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి, అన్ని

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఏడాది 2025 ఫిబ్రవరి 1 నుంచి ఆంధ్రలో భూమి రిజిస్ట్రేషన్ ఫీజుల మోత

Telangana MLC Constituencies: తుది ఓటర్ల జాబితా విడుదల.. వివరాలివే..

Black Moon: డిసెంబర్ 31, 2024.. బ్లాక్ మూన్‌ని చూడొచ్చు.. ఎలాగంటే?

ఉగాది నుండి అమలులోకి మహిళలకు ఉచిత బస్సు పథకం?

అపుడు బూతులు తిట్టి.. ఇపుడు నీతులు చెబితే ఎలా? : పేర్ని నానిపై పవన్ కళ్యాణ్ ఫైర్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments