Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

డీవీ
మంగళవారం, 21 మే 2024 (14:54 IST)
Sudhir Babu
సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హరోం హర' ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఆకట్టుకునే పాటలు, ఆసక్తిని రేకెత్తించే టీజర్, ప్రోమోలకు అద్భుతమైన స్పందనతో, సినిమాపై హ్యుజ్ హైప్ క్రియేట్  చేశాయి. సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మురుగన్ పాట, సునీల్‌తో అతని స్నేహాన్ని చూపించడం కూడా విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు.
 
ముందుగా మే 31న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా జూన్ 14కి షిఫ్ట్ చేశారు. చేతిలో తుపాకీతో ఉన్న సుధీర్ బాబు బ్రాండ్ న్యూ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా ఈ వార్తను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 14న నోటెడ్ సినిమా ఏదీ రానందున, హరోం హర సోలోగా విడుదల కానుంది.
 
ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయికగా నటిస్తుండగా ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ చిత్రం చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగిన పీరియాడికల్ ఫిల్మ్.
 
చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్‌ రవితేజ గిరిజాల.
తారాగణం: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

Kodali Nani : అసోంలో కొడాలి నాని కీలక సహచరుడు కాళి అరెస్ట్

Chandrababu: పింఛన్ లబ్ధిదారుడి ఇంట కాఫీ తాగిన చంద్రబాబు (video)

ఏడుకొండలు ఇంటిలో కాఫీ తయారు చేసిన సీఎం చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తర్వాతి కథనం
Show comments