Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Advertiesment
Sudheer Babu  Sunil

డీవీ

, శనివారం, 11 మే 2024 (18:45 IST)
Sudheer Babu Sunil
హీరో సుధీర్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హరోం హర' మేకర్స్ మురుగడి మాయ అనే కొత్త పాటను విడుదల చేశారు. టైటిల్ సూచించినట్లుగా, ప్రపంచంలో జరిగే ప్రతిచర్యకు కారణమైన మురుగన్ శక్తిని ఈ పాట నిర్వచిస్తుంది.
 
చైతన్ భరద్వాజ్ స్కోర్ చేసిన ఈ మెస్మరైజింగ్ నెంబర్ సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపుతుంది. రఘు కుంచె ఆ పాటను అద్భుతంగా పాడారు. భరద్వాజ పాత్రుడు కుప్పం యాసలో ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. మొత్తంమీద, మురుగడి మాయ  అద్భుతమైన కంపోజిషన్, అర్థవంతమైన సాహిత్యం, ఆకట్టుకునే వోకల్స్ తో ఇన్స్టంట్ హిట్ అయ్యింది. సుధీర్ బాబు , సునీల్ బాండింగ్ మరింత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది.
 
ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌కు సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగిన ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో మాళవిక శర్మ కథానాయిక.
 
అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ రవితేజ గిరిజాల. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
తారాగణం: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్
 
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - జ్ఞానసాగర్ ద్వారక
నిర్మాత - సుమంత్ జి నాయుడు
సంగీతం - చైతన్ భరద్వాజ్
డీవోపీ  - అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్ - రవితేజ గిరిజాల
బ్యానర్ - శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
పీఆర్వో - వంశీ శేఖర్
 
 
 
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా దర్శకుడు మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “ఇస్మార్ట్ శంకర్” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రంకి క్రేజీ సీక్వెల్ “డబుల్ ఇస్మార్ట్” ఇప్పుడు దానికి మించి భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ అసలు ఈ చిత్రంలోనే క్రేజీ అంశం ఏదన్నా ఉంది అంటే ఒక మనిషికి మెమొరీ ట్రాన్స్ఫర్ చేసే కాన్సెప్ట్ మనిషి మెదడుకి చిప్ పెట్టడం అనేది పూరి జగన్నాథ్ సైడ్ నుంచి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.
 
అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ లో రెండు చిప్ లు పెడతారు అన్నట్టుగా క్రేజీ అంశం వినిపిస్తుంది. అంటే ఇస్మార్ట్ శంకర్ రోల్ కే రెండు చిప్ లు ఉంటాయని తెలుస్తుంది. అందుకే డబుల్ ఇస్మార్ట్ అంటూ టైటిల్ పెట్టారని వినిపిస్తుంది. పైగా లేటెస్ట్ గా సోషల్ మీడియాలో గెటప్ శ్రీను ఇచ్చిన హిట్ కూడా వైరల్ గా మారుతుంది. దీనితో డబుల్ ఇస్మార్ట్ లో ఇలాంటి ఒక ఊహించని ట్రీట్ ఉంటుందో లేదో అనేది వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నంద్యాలలో వై.సి.పి. అభ్యర్థి రవి చంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ ప్రచారం