Webdunia - Bharat's app for daily news and videos

Install App

1989 నాటి నేపథ్యంతో సుధీర్ బాబు నటిస్తున్న హరోం హర రాబోతుంది

డీవీ
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (08:24 IST)
Sudhir Babu, Harom Hara
హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం హరోం హర విడుదలకు సిద్ధమవుతోంది. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ చిత్రం సుధీర్ బాబును మునుపెన్నడూ లేని ఇంటెన్స్ అవతార్‌లో ప్రజెంట్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది.
 
మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్- హరోం హరను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్  ప్రమోషన్‌లను ప్రారంభించారు. చైతన్ భరద్వాజ్ స్కోర్ చేసిన ఈ ఎనర్జిటిక్ నెంబర్ దైవిక శక్తి అనుభూతి అందిస్తోంది, ఇది ఓ ఫెరోషియస్ హీరో అద్భుత కథ.
 
కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని ఈ పాటకు పవర్ ఫుల్ లిరిక్స్ రాశారు, దీనికి అనురాగ్ కులకర్ణి  డైనమిక్ వాయిస్ తో ఆకట్టుకున్నారు. స్వరకర్త చైతన్ భరద్వాజ్ స్వయంగా ఎడిషనల్ వోకల్స్ అందించారు. పాటలో సుధీర్ బాబు బ్రూటల్ గా కనిపించారు. విజువల్స్ టాప్-నాచ్ గా ఉన్నాయి. ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడిగా నటిస్తున్న మాళవిక శర్మ కూడా ఈ పాటలో కనిపించింది.
 
కంపోజిషన్,  లిరిక్స్ , వోకల్స్, విజువల్స్ అన్నీ అద్భుతంగా వున్న ఈ ట్రాక్ చార్ట్‌బస్టర్ గా అలరుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు.
 
చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే హరోం హర కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు చెప్పనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి ది రివోల్ట్ అనేది ట్యాగ్ లైన్.
 
అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?

బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments