Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోపీచంద్ భీమా నుంచి ఫస్ట్ సింగిల్ ఎదోఎదో మాయ విడుదల

Gopichand, Priya Bhavani

డీవీ

, శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (18:27 IST)
Gopichand, Priya Bhavani
మాచో స్టార్ గోపీచంద్  యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమా' మేకర్స్ ఫస్ట్ ఆఫర్ టీజర్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఎదో ఎదో మాయ సాంగ్ ని విడుదల చేశారు.
 
టీజర్ ప్రధానంగా సినిమా బ్యాక్‌డ్రాప్‌ను, గోపీచంద్ పాత్రను టఫ్ కాప్‌గా పరిచయం చేయడంపై దృష్టి పెట్టగా, ఫస్ట్ సింగిల్ ద్వారా భీమా ప్రేమ కథను ప్రజెంట్ చేశారు.KGF, సలార్ ఫేమ్ రవి బస్రూర్ స్వరపరిచిన ఎదో ఎదో మాయ అద్భుతమైన రొమాంటిక్ నంబర్. కంపొజింగ్ చాలా ప్లజెంట్ వుంది , వెంటనే పాటతో ప్రేమలో పడతాము.
 
కళ్యాణ్ చక్రవర్తి రాసిన సాహిత్యం కథానాయకుడు తాను గాఢంగా ప్రేమిస్తున్న అమ్మాయి పట్ల చూపే ఆరాధనను వర్ణిస్తుంది. అతను ఆమెతో సమయం గడపడానికి తన ఇగోలను పక్కన పెట్టే పోలీసు. టీచర్‌గా పరిచయమైన మాళవిక శర్మ కూడా పిల్లలతో కలిసి మెలిసి వారికి సహాయం చేస్తూ కనిపించింది. గోపీచంద్, మాళవిక జంట తెరపై లవ్లీ, బ్యూటీఫుల్ కెమిస్ట్రీని పంచుకున్నారు. అనురాగ్ కులకర్ణి వాయిస్ కట్టిపడేసింది. మొత్తంమీద పాట శాశ్వతమైన ముద్ర వేస్తుంది.
 
ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ మరో కథానాయిక. స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీని, సాలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
 
రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. కిరణ్ ఆన్‌లైన్ ఎడిటర్, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, వెంకట్,  డాక్టర్ రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
 
ఇటీవల మేకర్స్అనౌన్స్ చేసినట్లుగా 'భీమా' మహా శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలోకి రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చియాన్ విక్రమ్ 62వ ప్రాజెక్ట్‌లో ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య