Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సుధీర్ బాబు నోరు జారాడా? మహేష్ బాబు ఫ్యాన్స్ అయోమయం...

హీరో సుధీర్ బాబు న‌టించిన తాజా చిత్రం న‌న్ను దోచుకుందువ‌టే. ఈ సినిమా ప్ర‌మోష‌న్లో భాగంగా సుధీర్ బాబు కాలేజీల‌ని ఓ రౌండ్ చుట్టేస్తూ యూత్‌కి దగ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (18:27 IST)
హీరో సుధీర్ బాబు న‌టించిన తాజా చిత్రం న‌న్ను దోచుకుందువ‌టే. ఈ సినిమా ప్ర‌మోష‌న్లో భాగంగా సుధీర్ బాబు కాలేజీల‌ని ఓ రౌండ్ చుట్టేస్తూ యూత్‌కి దగ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాని సుధీర్ బాబు త‌న సొంత బ్యాన‌ర్లో నిర్మించారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ & టీజ‌ర్‌కి మంచి స్పంద‌న ల‌భించింది. ఇటీవ‌ల స‌మ్మోహ‌నం సినిమా మంచి విజ‌యాన్ని అందించింది. దీంతో ఈ సినిమాపై కూడా మంచి అంచ‌నాలు ఉన్నాయి.
 
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్ర‌మోష‌న్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ... సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌యోపిక్ రానుంద‌ని ఎనౌన్స్ చేసాడు. ఈ బ‌యోపిక్ గురించి క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయో ఏమో కానీ.. సుధీర్ బాబు ఎనౌన్స్ చేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఫ్యాన్స్ అయితే కృష్ణ బ‌యోపిక్ రావాల‌ని కోరుకుంటున్నారు. 
 
అయితే.. ఈ సినిమాని డైరెక్ట్ చేసేది ఎవ‌రు..? నిర్మాత ఎవ‌రు..? ఈవేమీ తెలియ‌కుండానే సుధీర్ బాబు ఎనౌన్స్ చేసేసార‌ని... ఫ్యాన్స్‌ని చూసిన ఆనందంలో నోరు జారాడేమో అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ కామెంట్లపై అయోమయంలో వున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీని వణికించిన భూకంపం - పలు నగరాల్లో ప్రకంపనలు

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments