Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామా మశ్చీంద్ర నుండి సుధీర్ బాబు న్యూ లుక్

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (11:39 IST)
Sudhir Babu new look
సుధీర్ బాబు కథానాయకుడిగా నటుడు దర్శకుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పై సునీల్ నారంగ్,  పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న చిత్రం మామా మశ్చీంద్ర. ఈ చిత్రంలో  హీరో ని మూడు విభిన్న షేడ్స్లో చూపించ బోతున్నారు హర్షవర్ధన్ . సుధీర్ బాబు దుర్గ, పరశురామ్, డీజే మూడు పాత్ర లలో కనిపిస్తారు. మేకర్స్ ఈరోజు దుర్గ లుక్ విడుదల చేసారు.
 
పొడవాటి జుట్టు , గడ్డంతో సుధీర్ బాబు ఇక్కడ కొంచెం లావు గా కనిపిస్తున్నాడు. ఈ పాత్ర ఊబకాయంతో ఉండే వ్యక్తి గా ఉండబోతుంది అని తెలుస్తుంది. కారు బానెట్ పై కూర్చున్న సుధీర్ బాబు బంగారు గొలుసు వాచ్, ట్రెండీ అవుట్ ఫిట్ ధరించి విలనీ స్మైల్ తో కనిపించాడు. నైట్రో స్టార్ మేక్ఓవర్ ఆశ్చర్యం కలిగించే లాగా ఉంది. సుధీర్ బాబు ఎప్పుడూ విభిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తాడు.ఈ పాత్ర పూర్తిగా విలక్షణమైనదిగా కనిపిస్తుంది.
 
మామా మశీంద్ర అనే టైటిల్ నైట్రో స్టార్ సుధీర్ బాబు యొక్క మల్టీ షేడ్ క్యారెక్టర్  సూచిస్తుంది. పరశురామ్ లుక్ ని ఈ నెల 4న, డీజే లుక్ ని 7న విడుదల చేయనున్నారు.
 
సృష్టి సెల్యులాయిడ్ కి చెందిన సోనాలి నారంగ్, సృష్టి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది.
 
వినూత్నమైన కాన్సెప్ట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్గా రూపొందించబడిన ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు నటించారు, ఇందులో అగ్రశ్రేణి సాంకేతిక బృందం పని చేస్తోంది.
 
చైతన్ భరద్వాజ్ సౌండ్ ట్రాక్ లను అందించగా, పిజి విందా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments