Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్ బాబు, మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి చిత్రం

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (20:22 IST)
`సమ్మోహనం`, `వి` తర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్లో మూడో చిత్రం రూపోందుతోంది. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద‌ర్శ‌కుడు మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డం విశేషం. 
 
ఈ చిత్రం ఈ రోజు హైద‌రాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి వి.వి. వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా, మైత్రి మూవీ మేక‌ర్స్ వై. ర‌విశంక‌ర్ కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత దిల్‌రాజు  గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వెంకీ కుడుముల స్క్రిప్ట్‌ను మేక‌ర్స్‌కి అంద‌జేశారు.
 
ఇంకా పేరు పెట్ట‌ని ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. గాజుల ప‌ల్లి సుధీర్‌బాబు స‌మ‌ర్ఫ‌ణ‌లో బెంచ్ మార్క్ స్టూడియోస్ ప‌తాకంపై బి. మ‌హేంద్ర‌బాబు, కిర‌ణ్ బ‌ల్ల‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. 
 
వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తుండ‌గా పీజీ విందా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్ మార్తాండ్ కె. వెంక‌టేష్‌. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు.
 
అవ‌స‌రాలు శ్రీ‌నివాస్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం మార్చి నుండి సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ చిత్రానికి ర‌చ‌న‌, ద‌ర్శ‌కత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి, నిర్మాత‌లు: బి. మ‌హేంద్ర‌బాబు, కిర‌ణ్ బ‌ల్ల‌ప‌ల్లి స‌మ‌ర్ఫ‌ణ‌: గాజుల ప‌ల్లి సుధీర్‌బాబు, సంగీతం: వివేక్ సాగ‌ర్, సినిమాటోగ్ర‌ఫి: పీజీ విందా, ఆర్ట్‌: ర‌వీంద‌ర్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments