Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుదీప్ -కే3 కోటికొక్కడు నవంబ‌ర్ 12న సిద్ధ‌మైంది

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (16:45 IST)
k3 still
శివ కార్తీక్ దర్శకత్వంలో సుదీప్ కే3 కోటికొక్కడు అనే సినిమాను చేశారు. కన్నడలో కే 3 చిత్రం విడుదలైంది. కన్నడ పరిశ్రమ ట్రేడ్ లెక్కల ప్రకారం రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు చేసి సుదీప్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.  ఈ చిత్రాన్ని నవంబర్ 12న‌ తెలుగులో విడుద‌ల‌చేయ‌నున్నారు.
 
ఈ క్రమంలోనే `కే3 కోటికొక్కడు` ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. విదేశాల్లో బాంబ్ బ్లాస్ట్ జరగడం, మీడియా అంతా కూడా ఘోస్ట్ గురించి ప్రస్థావించడం, ఆ బాంబ్ బ్లాస్ట్‌లో దాదాపు 40 మంది క్రిమినల్స్ చనిపోతారు.
 
ఇక ఇంటర్ పోల్ అధికారి అప్తబ్ శివ్ధసాని ఘోస్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటాని శపథం చేస్తాడు. ఇక సుదీప్ ఎంట్రీ  కచ్చితంగా విజిల్స్ పడేలా ఉంది. మడోన్నా సెబాస్టియన్ సుదీప్ జోడికి అందరూ ఫిదా అవుతారు. ఈ ట్రైలర్‌లో శ్రద్దా దాస్, రవి శంకర్, నవాబ్ షా తదితరులు కనిపించారు.
 
ఈ ట్రైలర్ మొత్తంగా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మరీ ముఖ్యంగా యాక్షన్ మూవీ లవర్స్‌ను కచ్చితంగా అలరిస్తుందని తెలుస్తోంది.  కే3 కోటికొక్కడు తెలుగు ట్రైల‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది.  గుడ్ సినిమా గ్రూప్ సంస్థ కే3 కోటికొక్కడు చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది.
 
నటీనటులు : కిచ్చా సుదీప్, మడోన్నా సెబాస్టియన్, శ్రద్దా దాస్, రవి శంకర్, నవాబ్ షా తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments