Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాప్టర్‌లో చార్ ధామ్ యాత్రకు సమంత!

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (16:29 IST)
Samantha Akkineni
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల నుంచి చిన్న విరామం తీసుకుంటోంది. ఈ విరామ సమయంలో తనకు నచ్చిన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎంజాయ్ చేస్తోంది. అక్టోబర్ 20న సమంత, ఆమె స్నేహితురాలు శిల్పా రెడ్డి రిషికేష్ వెళ్లారు. గంగానదిని సందర్శించడమే కాకుండా సామ్, శిల్పా హెలికాప్టర్‌లో చార్ ధామ్ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 
 
శిల్పా రెడ్డి చార్ ధామ్ యాత్రకు సంబంధించి సమంత తో కలిసి ఉన్న తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. "టేక్ ఆఫ్.. మొదట యమునోత్రికి" అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది. ఈ పిక్‌లో సమంత బ్రైట్ పర్పుల్ చుడిదార్‌లో అందంగా కనిపిస్తుండగా, శిల్పా శెట్టి వెస్ట్రన్ వేర్‌లో కనిపిస్తుంది.
 
కాగా అక్టోబర్ 2న సమంత, నాగ చైతన్య ఇద్దరూ కలిసి తమ విడాకుల విషయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత సోషల్ మీడియాలో వాళ్ళ విడాకులకు సంబంధించిన పుకార్లు షికార్లు చేయడం, సోషల్ మీడియాలో ఆమెపై నెగెటివ్ ప్రచారం చేయడంపై గట్టిగా స్పందించింది. 
 
నిన్న మూడు ఛానళ్ళపై పరువు నష్టం దావా వేసింది. మరోవైపు విడాకుల తరువాత తిరిగి నటన ప్రపంచంలో మునిగిపోవడానికి సిద్ధమైన సామ్ ఇటీవల తమిళ, తెలుగు ద్విభాషా చిత్రానికి సంతకం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments