Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూర్చుంది చాలు `స్టాండ‌ప్..` అంటోన్న రాజ్‌త‌రుణ్

Webdunia
మంగళవారం, 11 మే 2021 (20:43 IST)
Rajtarun look
రాజ్ త‌రుణ్ హీరోగా డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `స్టాండ‌ప్ రాహుల్‌`. `కూర్చుంది చాలు` అనేది ట్యాగ్ లైన్‌. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సాంటో మోహన్ వీరంకి ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అవుతున్నారు.
 
రాజ్‌త‌రుణ్ కెరీర్‌లోనే ఒక డిఫ‌రెంట్ జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ఫ‌స్ట్‌లుక్ అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ప్ర‌స్తుతం ఈ జోన‌ర్ సినిమాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీంతో పాటు టైటిల్ ఆసక్తికరంగా ఉండ‌డం,స్టైలిష్ మేకోవ‌ర్‌లో యూబ‌ర్‌-కూల్‌గా రాజ్‌త‌రుణ్ ఉన్న ఫ‌స్ట్‌లుక్ కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి.
 
మంగ‌ళ‌వారంనాడు రాజ్‌త‌రుణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా `స్టాండ‌ప్ రాహుల్‌` చిత్రం నుండి మ‌రో స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్‌చేసి శుభాకాంక్ష‌లు తెలిపింది చిత్ర యూనిట్‌. క్రియేటివ్‌గా ఉన్న ఈ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.
 
ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా  స్వీకర్ అగస్తి సంగీతం,  శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్ర‌ఫి నిర్వ‌హిస్తున్నారు. వెన్నెల‌కిషోర్‌, ముర‌ళిశ‌ర్మ‌, ఇంద్ర‌జ‌, దేవీ ప్ర‌సాద్ మ‌రియు మ‌ధురిమ ఇతర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments