Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (15:15 IST)
ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న "ఎస్ఎస్ఎంబీ-29" చిత్రం షూటింగ్ వల్ల భవిష్యత్‌లో ఒరిస్సా సినిమా షూటింగులతో పాటు పర్యాటక రంగానికి ఒక గొప్ప గమ్యస్థానంగా మారుతుందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆమె గురువారం ఓ ట్వీట్ చేశారు. 
 
గతంలో మల్కాన్‌గిరిలో "పుష్ప-2" చిత్రం షూటింగ్ జరిగినట్టే, ఇపుడు ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోయే చిత్రం 'ఎస్ఎస్ఎంబీ-29' కోసం కోరాపుట్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి ప్రియాంక్ చోప్రా నటిస్తున్నారు. ఇది ఒరిస్సా పర్యాటక రంగానికి మంచి అవకాశంలాంటిది. 
 
ఈ చిత్రం షూటింగ్ వల్ల భవిష్యత్‌లో ఒరిస్సా సినిమా షూటింగులతో పాటు పర్యాటక రంగానికి ఒక గొప్ప గమ్యస్థానంగా మారుతుంది. మా దగ్గర షూటింగ్స్ చేసేందుకు అన్ని భాషల ఇండస్ట్రీలను స్వాగతిస్తున్నాం. షూటింగులకు పూర్తి మద్దతు, ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇస్తున్నాం" అని ఒరిస్సా ఉప ముఖ్యమంత్రి తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఇపుడు ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీళ్ళు భలే దొంగలురా బాబూ... చోరీకొచ్చి ఏం తీసుకెళ్లారో తెలుసా? (Video)

మాట వినని విద్యార్థులు.. గుంజీలు తీసిన హెడ్మాస్టర్ (Video)

పెళ్లయిన వారానికే మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (Video)

తండ్రిని చూడ్డానికి వచ్చి కన్నబిడ్డల్ని వదిలేసిన వెళ్లిపోయిన కసాయి తల్లి.. ఎక్కడ? (video)

సునీతా విలియమ్స్ భూమికిరాక మరింత ఆలస్యం.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments