Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి' ... పుష్ప నుంచి మరో ఆడియో సాంగ్ రిలీజ్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (11:22 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - కె.సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప". రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. ఈ సినిమా నుంచి శ్రీ‌వ‌ల్లి పాట ప్రోమోను ఆ సినిమా యూనిట్ మంగళవారం రిలీజ్ చేయగా, బుధవారం ఆడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది. 
 
ఈ సినిమాలో రష్మిక మందన్నా శ్రీ‌వ‌ల్లిగా నటిస్తోంది. 'చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయేనే.. చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి.. న‌వ్వే న‌వ‌ర‌త్న‌మాయెనే' అంటూ చంద్రబోస్ రాసిన లిరిక్స్ అల‌రిస్తున్నాయి.
 
ఈ సినిమా కోసం చంద్ర‌బోస్ రాసిన 'దాక్కో దాక్కో మేక' పాట‌కు కూడా మంచి స్పంద‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే. 'శ్రీ‌వ‌ల్లి' పాటని అక్టోబరు 13న ఉదయం 11.07కు విడుదల చేసింది. 
 
ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, రావు రమేశ్, అజయ్ ఘోష్, అనసూయ తదితరులు కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి భాగం డిసెంబర్‌ 17వ తేదీన విడుదల కానున్న‌ట్లు ఆ సినిమా యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments