Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేతిరెడ్డి షాకింగ్... 'లక్ష్మీస్ వీరగ్రంథం'లో లక్ష్మీపార్వతిగా శ్రీరెడ్డి

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (21:19 IST)
ఎన్టీఆర్ బయోపిక్ చివరికి ఏమైపోతుందో తెలియడంలేదు. ఎందుకయ్యా అంటే... వరుసగా ముగ్గురు దర్శకనిర్మాతలు ఎన్టీఆర్ బయోపిక్ తీసేస్తున్నారు. ఇప్పటికే నందమూరి నట సంహం బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదలవుంది. ఇదిలావుండగానే రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.
 
తిరుమల తిరుపతి శ్రీవారిని లక్ష్మీపార్వతిని వెంటబెట్టుకుని వెళ్లి మరీ దర్శించుకున్నారు. ఆ తర్వాత చిత్ర విశేషాలను ప్రకటించారు. జనవరి నెలలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎవరు ఎలా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలను తీసినా ఎన్టీఆర్ ఆశీర్వాదాలు మాత్రం తన చిత్రానికే వుంటుందని ఆయన ప్రకటించారు. 
 
ఇకపోతే... తాజాగా దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఓ షాకింగ్ న్యూస్ వెల్లడించారు. తను తీయబోయే లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రంలో లక్ష్మీపార్వతి పాత్రలో శ్రీరెడ్డి పోషించనున్నట్లు తెలిపారు. ఇందుకు కారణం కూడా రాంగోపాల్ వర్మేనంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఎందుకంటే... గతంలో క్యాస్టింగ్ కౌచ్ పైన శ్రీరెడ్డి పోరాటం చేయగా దానికి వర్మ మద్దతు పలికారనీ, అందువల్ల ఆమెకు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శ్రీరెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నామనీ, త్వరలోనే పూర్తి వివరాలను చెపుతానని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: తెలుగు రాజకీయాల్లో విడిపోయిన మరో కుటుంబం.. టీడీపీలోకి కవిత ఎంట్రీ ఇస్తారా?

నోబెల్ పురస్కారానికి సిఫార్సు చేయలేదనే భారత్‌పై ట్రంప్ అక్కసు.. అందుకే సుంకాల పోటు

Nara Lokesh: జగన్ ప్రవర్తనపై మండిపడ్డ నారా లోకేష్.. తల్లికి విలువ లేదు.. అయినా ప్రేమ మారదు

ట్రంప్ సర్కారుకు అమెరికా ఫెడరల్ కోర్టులో షాక్

KA Paul: కవితకు ఆఫర్ ఇచ్చిన కేఏ పాల్.. ప్రజాశాంతిలో చేరుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments