Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాస కళ్యాణం.. పెళ్లంటే పెద్ద పండుగ.. జీవితంలో ఒక్కసారే.. ట్రైలర్ సూపర్బ్

నితిన్, రాశీఖన్నా జంటగా నటించిన సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్స్‌కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం సినీ యూనిట్ ట్విట్టర్ ద్వారా విడు

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (18:16 IST)
నితిన్, రాశీఖన్నా జంటగా నటించిన సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్స్‌కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం సినీ యూనిట్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ట్రైలర్ మొత్తం కలర్‌ఫుల్‌గా వుంది. 
 
నిమిషం 54 సెకన్లున్న ఈ ట్రైలర్‌లో... మనవడు నాన్నమ్మను పెళ్లంటే ఏంటి అని అడుగగా.. పెళ్లంటే పేద్ద పండగ అని నటి జయసుధ వాయిస్ వినిపిస్తోంది. ఈ తర్వాత ఫోన్‌లో ఎవరు గర్ల్ ఫ్రెండా అని హీరో నితిన్‌ను అడుగుతుంది హీరోయిన్. కావాల్సింది తీసుకోవాలంటే మీ అమ్మాయిలను పొగడాలిగా అంటాడు నితిన్. లవ్‌ ఫీల్ వున్న డైలాగ్స్, తన ప్రేమను ప్రకాశ్ రాజ్ అయిన తండ్రితో చెప్పి ఒప్పించిన రాశీఖన్నా డైలాగ్స్ బాగున్నాయి. 
 
ఆపై పెళ్లంటే పెళ్లిలా జరగాలి.. ఫంక్షన్ లా కాదు. పెళ్లికి మన అనుకునేవాళ్లందరూ వస్తారు. వాళ్లను చూస్తుంటే డెబ్బై ఏళ్ల జీవితం గుర్తుకువస్తోందని జయసుధ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తోందని.. సినీ పండితులు అంటున్నారు. కాగా శ్రీ వేంకటేశ్వరా బ్యానర్‌‍పై రూపొందిన ఈ మూవీ ఆగస్టు 9న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments