Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా ఇట్స్ టైమ్ టు పార్టీ ఫస్ట్ లుక్ విడుదల

Webdunia
సోమవారం, 11 మే 2020 (15:41 IST)
బుల్లితెర రాములమ్మ, ప్రముఖ యాంకర్, 'బిగ్ బాస్ 3' ఫేమ్ శ్రీముఖి ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం 'ఇట్స్ టైమ్ టు పార్టీ'. గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎయిన్స్ మోషన్ పిక్చర్స్, కాక్ టైల్ సినిమాస్ పతాకంపై అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్ నిర్మించారు.
 
మే 10 శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత గౌతమ్ ఇ.వి.ఎస్ మాట్లాడుతూ.... "ఇదొక సైబర్ క్రైమ్ థ్రిల్లర్. నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ప్రస్తుత సమాజంలో యువతరం జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది. సినిమాలో శ్రీముఖి ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం లేదు. కానీ, ఆమెది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి పాత్రలో శ్రీముఖి నటించలేదు. 
 
ఆమె అభిమానులకు, ప్రేక్షకులకు ఈ క్యారెక్టర్ సర్ప్రైజ్ ఇస్తుంది. పాత్రలో ఆవిడ అద్భుతంగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి అని అన్నారు. శ్రీముఖి, దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పిఆర్ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి, ఎడిటర్: అనిల్ కుమార్ పి, కెమెరామెన్: దిలీప్ కుమార్ ఎంఎస్, సంగీతం: శేఖర్ మోపూరి, సహ నిర్మాత: సిహెచ్ వేణు మాధవ్, నిర్మాతలు: అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్, దర్శకుడు: గౌతమ్ ఇ.వి.ఎస్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

ఓ సాదాసీదా ఆర్టీఓ కానిస్టేబుల్: ఇంట్లో రూ. 11 కోట్లు నగదు, 52 కేజీల బంగారం, 234 కిలోల వెండి, ఎలా వచ్చాయి?

వివాదాలతో పని ఏల? వినోదం వుండగా: పుష్ప 2 కలెక్షన్ పై రిపోర్ట్

బంగాళాఖాతంలో అల్పపీడనం: రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు

డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను : బీజేపీ నేత శపథం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments