కోట బొమ్మాళి PS చిత్రంలో పాటను హమ్ చేస్తున్న హీరోయిన్ శ్రీలీల

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (17:16 IST)
Srileela launch song
తెలుగులో అనేక సినిమాలు నిర్మించిన GA2 పిక్చర్స్ బ్యానర్ తాజాగా మలయాళ సూపర్ హిట్ నాయాట్టు కి రీమేక్ గా కోట బొమ్మాళి పిఎస్ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పుడు కోట బొమ్మాళి PS మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు మేకర్స్. సోమవారం ఇందులోని మొదటి పాటను విడుదల చేశారు. 
 
ఇప్పటికే హుక్ స్టెప్ ద్వారా విడుదల చేసిన పాట ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. *లింగి లింగి లింగిడి* అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు *రేలారే* ఫేమ్ పి.రఘు సాహిత్యం అందించడంతోపాటు స్వయంగా పాడిన తీరు అందర్నీ ఆకర్షిస్తుంది. ముకుందన్ పాటను కంపోజ్ చేయగా విజయ్ పోలకి అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు. కలర్ ఫుల్ సెట్లో రాహుల్ విజయ్ శివానితో కలిసి శ్రీకాంత్ చేసిన సింపుల్ డాన్స్ మూమెంట్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ శ్రీలీల విడుదల ఈ పాటకు యూత్ లో మంచి క్రేజ్ వస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. *జోహార్*, *అర్జున ఫాల్గుణ* వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

వామ్మో, జనంలోకి తోడేలుకుక్క జాతి వస్తే ప్రమాదం (video)

బలహీనపడుతున్న దిత్వా తుఫాను.. అయినా ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments