`ఇప్పటి వరకూ నేను 250కి పైగా చిత్రాల్లో నటించాను. కానీ `శ్రీకారం`లో చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యే రైతు పాత్రలో నటించాను. నా పాత్ర గురించి ఇప్పుడే చెప్పను కాని రేపు థియేటర్‌లో మీరు థ్రిల్ ఫీలవుతారు. కథలో చాలా ముఖ్యమైన పాత్ర. తప్పకుండా నా కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుంది`అని నరేష్ వి.కె. తెలియజేశారు.
శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించిన చిత్రం `శ్రీకారం`. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలను సమకూర్చారు. విలేజ్ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం మార్చి 11న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీలో ఒక కీలక పాత్రలో నటించిన సీనియర్ నటుడు నరేష్ వికె విలేకరులతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
- కరోనా తర్వాత భారతదేశంలో ప్రతి ఇండస్ట్రీ తెలుగు సినీ పరిశ్రమవైపు చూస్తుంది. అందుకు ఒక తెలుగు నటుడిగా గర్వంగా ఉంది. ప్రస్తుతం మన పరిశ్రమ సక్సెస్ రేట్ కానీ, యువ ప్రతిభావంతులైన దర్శకుల సంఖ్య పెరగడం సంతోషించదగ్గ విషయం.
- గత పది సంవత్సరాలుగా నేను ఎన్నో మంచి మంచి పాత్రల్లో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. లాక్డౌన్ సమయంలో కూడా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య లాంటి మంచి సినిమాల్లో నటించాను.
- ముఖ్యంగా ఈ నాలుగు నెలల కాలంలో నిర్విరామంగా షూటింగ్ చేసి 12 సినిమాల్ని పూర్తిచేశాను. అందులో పాతవి కొన్ని ఉన్నాయి అలాగే కరోనా తర్వాత మొదలైన సినిమాలు ఉన్నాయి. అన్ని మంచి పాత్రలే కావడం విశేషం. నాకు నటనలో ఎస్ వి రంగారావు గారు స్పూర్తి. ఆయనలా అన్ని రకాల పాత్రలు చేసి ప్రేక్షకులని మెప్పించాలన్నదే నా అభిలాష.
- ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఒక కొత్త ఎమోషన్ ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. శ్రీకారం విషయానికి వస్తే ఎంటర్టైన్‌మెంట్‌ని ఒక కొత్త బ్యాక్ డ్రాప్లో తీసుకుని దానికి ఎమోషన్ ని యాడ్ చేసి ఒక యువ దర్శకుడితో ఈ సినిమా తీసినందుకు ముందుగా 14రీల్స్ ప్లస్ నిర్మాతల్ని నేను అభినందిస్తున్నాను. రామ్ ఆచంట, గోపి ఆచంట, హరీష్ కట్టా తెలుగు సినీ పరిశ్రమలో డెడికేటెట్ ప్రొడ్యూసర్స్. నేను గతంలో కూడా వారితో పనిచేశాను.
- రియాల్టీకి దగ్గరగా ఎమోషన్స్‌ని కనెక్ట్ చేసి తీసిన ఈ సినిమా 14 రీల్స్ ప్లస్ కి అవార్ఢులు, రివార్ఢులు తీసుకువస్తుందని నేను నమ్ముతున్నాను.
- ఇప్పటి వరకూ నేను 250కి పైగా చిత్రాల్లో నటించాను. అయితే 20 ఎకరాల్లో ఒక పొలం సెట్ వేయడం నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది. అది చాలా శ్రమతో కూడిన పని.
- ఈ రోజుల్లో చాలా మంది ఎన్నారైలు ఉద్యోగాలు వదిలిపెట్టి వ్యవసాయం చేయడానికి ఇక్కడికి వస్తున్నారు దాన్ని బేస్ గా తీసుకుని కిషోర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
- శర్వానంద్ న్యూ జనరేషన్ హీరో..ఇలాంటి మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నందుకు శర్వాని నేను అభినందిస్తున్నాను. చాలా బాగా నటించాడు. సాయి మాధవ్ బుర్రా అద్భుతమైన సంభాషణల్ని రాశారు.
- ఈ మూవీ ఆల్‌రెడీ మ్యూజికల్‌గా మంచి హిట్ అయ్యింది, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తప్పకుండా తెలుగు పరిశ్రమలో జాతీయ స్థాయిలో చెప్పుకునే మంచి సినిమా అవుతుంది.