'దేవర' షూటింగులో నటుడు శ్రీకాంత్‌కు గాయం

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (16:15 IST)
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న "దేవర" చిత్రంలో శ్రీకాంత్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల గోవాలో జరుపుకుంది. అక్కడ తనకు గాయమైనట్టు శ్రీకాంత్ తాజాగా వెల్లడించారు. "కోట బొమ్మాళి" సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, ఆయన ఓ రియాలిటీ షోకు వెళ్లారు. 
 
అందులో ఆయన మాట్లాడుతూ, 'దేవర' షూటింగ్ సెట్‌కు ఇసుకలో నడుచుకుంటూ వెళుతుంటే కాలు మడతపడటంతో కింద పడ్డాను. చిన్న గాయమే అనుకున్నా. కొంతసేపటికి మోకాలంతా వాపు వచ్చింది. వైద్యుడని సంప్రదింస్తే కొన్ని రోజుల విశ్రాంతి తీసుకోవాలన్నారు. 
 
కానీ, నేను షూటింగులో పాల్గొన్నా. నిలబడే డైలాగులు చెప్పాను. ఇపుడు కూడా 'దేవర' సెట్ నుంచే వచ్చాను. దీంతో విశ్రాంతి తీసుకోవాలంటూ శ్రీకాంత్‌కు ఆయన అభిమానులు సూచించారు. 
 
కాగా, దేవర చిత్రంలో హీరోయిన్‌గా అతిలోకసుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్నారు. విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో వేసిన ప్రత్యేకమై సెట్‌లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సముద్రతీరం నేపథ్యంలో భయం అనే అంశం ప్రధానంగా సాగే చిత్రమిది. తొలి భాగం వచ్చే యేడాది ఏప్రిల్ 5వ తేదీన రానుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: రేవంత్ రెడ్డి ఏ అవకాశాన్ని వదులుకోలేదు..

'కర్మ హిట్స్ బ్యాక్' : జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత కామెంట్స్

Prashant Kishore: ఈ PK చెప్పడానికే కాని చేయడానికి పనికిరాడని తేల్చేసిన బీహార్ ప్రజలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments