Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఫేవరేట్ లేదని నా హృదయం తల్లడిల్లిపోతోంది.. ఇక బర్త్‌డే ఎందుకు?

'అతిలోకసుందరి' శ్రీదేవి మరణాన్ని బాలీవుడ్ ప్రముఖులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా, పలువురు హీరోయిన్లు శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ బోరున విలపిస్తున్నారు.

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (21:07 IST)
'అతిలోకసుందరి' శ్రీదేవి మరణాన్ని బాలీవుడ్ ప్రముఖులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా, పలువురు హీరోయిన్లు శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ బోరున విలపిస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ఒకరు. ఈమె నటిగా ఉన్నప్పటికీ.. శ్రీదేవి అంటే చచ్చిపోయేంత అభిమానం. ఆమెతో వ్యక్తిగతంగా మంచి అనుబంధం కూడా ఉంది. దీంతో శ్రీదేవి ఇక లేదనే విషయాన్ని జీర్ణించుకోలేక వెక్కివెక్కి ఏడుస్తోంది. 
 
ఈనేపథ్యంలో మార్చి 21వ తేదీన ఈమె పుట్టిన రోజు రానుంది. ఈ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, రాణీ ముఖర్జీ ఏమన్నారంటే.. "శ్రీదేవి జ్ఞాపకాలు ఇప్పట్లో మరచిపోలేనని, ఈసారి పుట్టినరోజు వేడుకలకు కూడా తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా" అని చెప్పింది. 
 
ముఖ్యంగా, "నా ఫేవరెట్ (శ్రీదేవి) లేదని తెలిసి నా హృదయం తల్లడిల్లిపోతోంది. ఈసారి పుట్టినరోజు చేసుకోవాలని కూడా అనిపించడం లేదు. ఈ యేడాది నేను చాలా చాలా కోల్పోయాను" అంటూ కన్నీటిపర్యంతమవుతూ చెప్పుకొచ్చింది. 
 
అదేసమయంలో ప్రస్తుతం తాను నటించే కొత్త చిత్రం "హిచ్‌కి" సినిమాను శ్రీదేవికి అందరికంటే ముందుగానే చూపించేందుకు తాను ఎలా ప్లాన్ చేసుకున్నానో మాటల్లో చెప్పలేనని తెలిపింది. కానీ, ఇంతలోనే...అంతా అయిపోతుందని కలలో కూడా ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments