Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి డెత్ మిస్టరీ : ఆయన అలా చెప్పారు.. రిపోర్టు ఇలా చెప్పింది...

నటి శ్రీదేవి మృతి ఓ మిస్టరీగా మారనుంది. ఇప్పటికే అన్ని వేళ్లూ ఆమె భర్త బోనీ కపూర్‌ వైపు చూపిస్తున్నాయి. తన మేనల్లుడి వివాహం కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి... వివాహం, రిసెప్షన్ ముగిసిన తర్వాత కూడా దుబాయ్

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (08:29 IST)
నటి శ్రీదేవి మృతి ఓ మిస్టరీగా మారనుంది. ఇప్పటికే అన్ని వేళ్లూ ఆమె భర్త బోనీ కపూర్‌ వైపు చూపిస్తున్నాయి. తన మేనల్లుడి వివాహం కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి... వివాహం, రిసెప్షన్ ముగిసిన తర్వాత కూడా దుబాయ్‌లోనే ఉండిపోయారు. అంతేనా, భర్తతో పాటు కుటుంబ సభ్యులంతా తిరిగి భారత్‌కు వస్తే శ్రీదేవి ఒక్కరే అక్కడ ఉండిపోయారు. ఆ తర్వాత అదే హోటల్ బాత్రూమ్‌ బాత్‌టబ్‌లో పడి చనిపోయారు. ఇది యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. 
 
అయితే, శ్రీదేవి మృతిపై ఆమె మరిది సంజయ్ కపూర్ ఏమన్నారంటే... 'అవును, నటి శ్రీదేవి ఇకలేరు. శనివారం రాత్రి 11.00-11.30 గంటల సమయంలో ఆమె చనిపోయారు. ఇప్పుడే దుబాయ్‌ నుంచి ముంబై చేరుకున్నా. మళ్లీ దుబాయ్‌ వెళ్తున్నా. శ్రీదేవికి గతంలో ఎలాంటి హృదయ సంబంధిత అనారోగ్య సమస్యలూ లేవు. గుండెపోటు వచ్చిన సమయంలో ఆమెహోటల్‌ బాత్‌రూమ్‌లో ఉన్నారు'  అని వ్యాఖ్యానించారు.
 
అయితే దుబాయ్ ఫోరెన్సిక్ విభాగం ఇచ్చిన రిపోర్టు మాత్రం మరోలా ఉంది. "శ్రీదేవి స్పృహ కోల్పోయి, ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో మునిగి (యాక్సిడెంటల్‌ డ్రౌనింగ్‌) చనిపోయారు" అని మాత్రమే ఉంది. దీంతో శ్రీదేవి మృతిపై అనేకానేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కెమిస్ట్రీ బాగోలేదని విడాకులు తీసుకుంటున్నారు : వెంకయ్య నాయుడు

చీకట్లో ఏకాంతంగా గడిపిన ప్రేమికులు.. పట్టుకుని గుండు గీయించిన స్థానికులు...

తెలంగాణాలో మూడు రోజుల వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments