Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవికి నచ్చిన తెలుపు పువ్వులతోనే అంతిమ యాత్ర.. ప్రియా వారియర్ నివాళి

ప్రముఖ సినీ నటి శ్రీదేవి అంతిమ యాత్ర అభిమానుల అశ్రునయనాల మధ్య జరుగుతోంది. ఈ నేపథ్యలో శ్రీదేవి తెలుపు రంగంటే చాలా ఇష్టం. అందుకే ఆమె అంతిమ యాత్రకు ఉపయోగించిన వాహనాన్ని తెల్లటి పువ్వులతో అలంకరించారు. అంత

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (15:12 IST)
ప్రముఖ సినీ నటి శ్రీదేవి అంతిమ యాత్ర అభిమానుల అశ్రునయనాల మధ్య జరుగుతోంది. ఈ నేపథ్యలో శ్రీదేవి తెలుపు రంగంటే చాలా ఇష్టం. అందుకే ఆమె అంతిమ యాత్రకు ఉపయోగించిన వాహనాన్ని తెల్లటి పువ్వులతో అలంకరించారు. అంతిమ యాత్రకు ఉపయోగించిన వాహనం మొత్తం పలు రకాలైన తెల్లటి పువ్వులతో అలంకరించారు.

శ్రీదేవి చిత్రపటం చుట్టూ కూడా తెల్లటి పువ్వుల దండలను వుంచారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవి అంతిమ సంస్కారాలు జరుగుతాయి. ప్రస్తుతం అంతిమ యాత్ర అభిమానుల నడుమ జరుగుతోంది. 
 
మరోవైపు శ్రీదేవి మృతిపట్ల యావత్తు సినీ పరిశ్రమ మూగపోయింది. ఇన్నాళ్లు కళ్ల ముందు కదలాడిన శ్రీదేవి.. ప్రస్తుతం దివికేగడాన్ని సినీ ప్రముఖులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం శ్రీదేవి అంతిమ యాత్ర జరుగుతున్న నేపథ్యంలో శ్రీదేవి మృతిపట్ల ప్రియా వారియర్ విచారం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది.

గ‌తంలో కరణ్‌ జోహార్‌ తెరకెక్కించిన ''తుమ్‌ కభి హై ఖబర్‌ ముఝ్ కో భి.. హో రహా హే జుదా..'' పాటను పాడుతూ శ్రీదేవికి నివాళులు అర్పించింది. అలాగే చరిత్ర ఎప్పుడూ వీడ్కోలు పలకదని, తర్వాత కలుద్దామని మాత్రమే చెప్తుందని ప్రియా వారియర్ ట్వీట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments