Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి మరణంపై మీడియా సర్కస్ చూస్తే కోపం వస్తోంది: ప్రీతి జింటా

సినీ తార, అతిలోక సుందరి అంత్యక్రియలు ముగిసిన వేళ.. శ్రీదేవి మృతిపై మీడియా చేస్తున్న సర్కస్ చూసి కోపం, బాధ తన్నుకొస్తున్నాయని బాలీవుడ్ నటి ప్రీతి జింటా మండిపడింది. రేటింగ్ కోసం మీడియా దిగజారిందని.. నైప

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (18:57 IST)
సినీ తార, అతిలోక సుందరి అంత్యక్రియలు ముగిసిన వేళ.. శ్రీదేవి మృతిపై మీడియా చేస్తున్న సర్కస్ చూసి కోపం, బాధ తన్నుకొస్తున్నాయని బాలీవుడ్ నటి ప్రీతి జింటా మండిపడింది. రేటింగ్ కోసం మీడియా దిగజారిందని.. నైపుణ్యతకు, నటనకు నిలయమైన సినీతార శ్రీదేవిపై దిగజారుడు కథనాలు ప్రచురించేందుకు మీడియాకు అంత ధైర్యం ఎలా వచ్చిందంటూ ప్రీతి జింటా ప్రశ్నించింది. 
 
అలాగే ప్రీతి జింటా శ్రీదేవి పట్ల తనకున్న అభిమానాన్ని వెల్లడించింది. శ్రీదేవిని కడసారి చూసేందుకు రాలేకపోయానని బాధపడింది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాను రాలేకపోతున్నందుకు కారణం కూడా చెప్పింది. శ్రీదేవికి అంతిమ వీడ్కోలుకు అందరూ ముంబైకి వెళ్లేవుంటారు. కానీ ఈ భూగోళానికి మరోవైపున తానున్నట్లు ప్రీతి జింటా తెలిపింది.
 
తన చిన్ననాటి జీవితంలో భాగమైన... మై ఐకాన్ శ్రీదేవి వెళ్లిపోతోంది. హవాహవాయి తనను చూసి చిరునవ్వులు చిందిస్తోందంటూ పోస్టు చేసింది. ఆమె ఎప్పటికీ తన మనసులో వుంటుందని.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాని.. ఆమెకు గుడ్ బై చెప్పలేకపోతున్నందుకు బాధపడుతున్నానని ప్రీతి జింటా పోస్టు పెట్టింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments