Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి మరణం... రేపు ముంబైలో అంత్యక్రియలు!

లెజండరీ నటి, అతిలోకసుందరి శ్రీదేవి ఇక లేరు. బాలీవుడ్ నటుడు మొహిత్ మార్వా వివాహం నిమిత్తం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషి కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. సడెన్‌గా హార్ట్ ఎటాక్ రావడంతో ఈ లోక

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (14:24 IST)
లెజండరీ నటి, అతిలోకసుందరి శ్రీదేవి ఇక లేరు. బాలీవుడ్ నటుడు మొహిత్ మార్వా వివాహం నిమిత్తం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషి కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. సడెన్‌గా హార్ట్ ఎటాక్ రావడంతో ఈ లోకం విడిచి వెళ్లింది. 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రంతో రెండో ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ప్రారంభించిన శ్రీదేవి, ఆ తర్వాత తమిళంలో 'పులి' చిత్రంలోను, చిట్టచివరిగా 2017లో 'మామ్' సినిమాలోను నటించారు. 
 
దుబాయ్‌లో చనిపోయిన శ్రీదేవి భౌతికకాయం ఆదివారం ముంబైకి చేరుకోనుంది. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడి ఆస్పత్రిలో ఫార్మాలిటీస్ పూర్తి చేసి.. ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకురానున్నారు. దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు దగ్గరుండి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రానికి ముంబై అంధేరిలోని స్వగృహానికి శ్రీదేవి భౌతికకాయం ఆదివారం రాత్రికి చేరుకుంటే.. సోమవారం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
కాగా, 1963 ఆగస్టు 13వ తేదీన పుట్టిన శ్రీదేవి... అసలు పేరు అమ్మయ్యంగార్‌ అయ్యప్పన్‌. బాలనటిగా 1967లో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన శ్రీదేవి.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో 'పదహారేళ్ళ వయసు' సినిమాతో హీరోయిన్‌గా అలరించారు. 1996లో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో శ్రీదేవి వివాహం జరిగింది. ఈ జంటకు జాన్వీ, ఖుషీ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ఇప్పటివరకూ 15 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు పొందిన శ్రీదేవిని 2013లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments