Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య శవాన్ని భుజంపై మోసిన భర్త ఇపుడు లక్షాధికారి ఎలా?

అనారోగ్యంతో ఆస్పత్రిలో చనిపోయిన భార్యను ఆంబులెన్స్‌లో తరలించేందుకు డబ్బులు లేక 10 కిలోమీటర్లదూరం తన భార్య శవాన్ని భుజంపై వేసుకుని తన కుమార్తెను వెంటబెట్టుకుని నడిచిన ఓ భర్త ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం

Advertiesment
Odisha Man
, గురువారం, 7 డిశెంబరు 2017 (14:05 IST)
అనారోగ్యంతో ఆస్పత్రిలో చనిపోయిన భార్యను ఆంబులెన్స్‌లో తరలించేందుకు డబ్బులు లేక 10 కిలోమీటర్లదూరం తన భార్య శవాన్ని భుజంపై వేసుకుని తన కుమార్తెను వెంటబెట్టుకుని నడిచిన ఓ భర్త ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత 2016 ఆగస్టులో ఈ ఘటన జరిగింది. భార్య శవాన్ని మోసిన భర్త పేరు ధనామాఝీ. ఊరు ఒడిషా రాష్ట్రంలోని ఓ పల్లెటూరు. మాఝీ దయనీయమైనస్థితి ఎందరో హృదయాలను కలిసివేచింది. 
 
కానీ, ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అలమతి దై అనే మహిళను మాఝీ రెండో పెళ్లి చేసుకున్నాడు. పక్కా ఇంటిని నిర్మించుకుంటున్నాడు. తన ఇద్దరు కుమార్తెలను రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిస్తున్నాడు. తాను కూడా చెప్పులు లేకుండా నడిచిన వీధులు, రోడ్లపై ఇపుడు రూ.65 వేల విలువ చేసే హోండా బైక్‌పై తిరుగుతున్నాడు. మాఝీ జీవితం ఉన్నట్టుండి మారిపోవడానికిగల కారణాలు ఆయన తన భార్య శవాన్ని 10 కిలోమీటర్ల దూరం భుజంపై మోయడమే. ఈ అమానవీయమైన ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు అప్పట్లో ప్రకంపనలు రేపాయి. 
 
ఆ దృశ్యాలు ఎంతో మంది హృదయాలను కలిచివేశాయి. వాటిని చూసిన బహ్రెయిన్‌ ప్రధానమంత్రి, రాజు ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా మాఝీకి రూ.9 లక్షల చెక్కును పంపించారు. ఆయనతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా మాఝీకి భారీ మొత్తంలో సహాయం చేశాయి. 
 
అతడి పరిస్థితి తెలుసుకున్న అధికారులు ప్రధానమంత్రి గ్రామీణ్‌ ఆవాస్‌ యోజనా కింద కొత్త ఇంటిని మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ ఇల్లు నిర్మాణ దశలో ఉంది. అతడికి సహాయం కింద వచ్చిన నగదును బ్యాంకులో కుమార్తెల పేరిట ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేశాడు. ఇప్పుడు ఆనందంగా జీవిస్తున్నాడు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడిచిన రోడ్డుపై.. బైక్‌పై తిరుగుతున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌ గురించి ఆ విషయం మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు... జగన్ వ్యాఖ్య