Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండో పెళ్లి... బెడ్రూంలో కూడా కెమేరా... ఉరి వేసుకుంది, ఎందుకు?

ఈమధ్య సమాజంలో సంబంధాలు మరీ అతుకుల బొంతలా మారిపోతున్నాయి. ఎక్కడికక్కడ విచ్ఛిన్నమయిపోతున్నాయి. మరీ భార్యాభర్తల సంబంధాల విషయం రానురాను బాగా దెబ్బతింటున్నాయి. చిన్నచిన్న విషయాలకే విడిపోవడాలు, చనిపోవడాలు ఎక్కువవుతున్నాయి. మరోవైపు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్

Advertiesment
Businessman Wife
, బుధవారం, 6 డిశెంబరు 2017 (18:18 IST)
ఈమధ్య సమాజంలో సంబంధాలు మరీ అతుకుల బొంతలా మారిపోతున్నాయి. ఎక్కడికక్కడ విచ్ఛిన్నమయిపోతున్నాయి. మరీ భార్యాభర్తల సంబంధాల విషయం రానురాను బాగా దెబ్బతింటున్నాయి. చిన్నచిన్న విషయాలకే విడిపోవడాలు, చనిపోవడాలు ఎక్కువవుతున్నాయి. మరోవైపు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై, మంచిచెడ్డలు చెప్పే పెద్దవారు లేకపోవడం కూడా దీనికి ఓ కారణమవుతోంది.
 
ఇక భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకునేవారు కొందరైతే, రాక్షసుడు లాంటి భర్త కారణంగా చనిపోయేవారు మరికొందరు. ఇలాంటి భర్త చేతిలో ఆదివారం నాడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ మహిళ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే... భోపాల్ నగరంలోని పుష్పనగర్ నివాసి, వ్యాపారవేత్త అయిన ఖేమ్‌రాజ్‌తో 38 ఏళ్ల షేల్‌కుమారికి వివాహమైంది. ఐతే ఈ పెళ్లి వీరిద్దరికీ రెండోదే. 
 
కుమారి మొదటి భర్తకు విడాకులివ్వగా, ఖేమ్‌రాజ్ కూడా తన భార్య లేకపోవడంతో ఈమెను పెళ్లాడాడు. కొన్నాళ్లపాటు ఇద్దరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాతే ఖేమ్‌రాజ్ మృగంలా మారాడు. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. డబ్బులు కావాలంటూ ఒత్తిడి చేసేవాడని ఆమె సోదరి ఆరోపిస్తున్నారు. తన సోదరి ఒకరోజు తనకు ఫోన్ చేసి... ఇంటినిండా కెమేరాలు పెట్టారనీ, ఆఖరికి బెడ్రూంలో కూడా కెమేరాలు అమర్చి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ విలపించిందని చెప్పుకొచ్చింది. 
 
ఐతే అవన్నీ అవాస్తవాలంటున్నాడు ఖేమ్ రాజ్. కుమారికి పిచ్చిపట్టిందనీ, ఆమె ఎక్కడ ఏ అఘాయిత్యానికి పాల్పడుతుందోనని ఇంట్లో కెమేరాలు అమర్చినట్లు వెల్లడించాడు. తను ఎన్ని చేసినా ఆమె ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నదని చెపుతున్నాడు. ఇంట్లో కెమేరాలున్నాయి కదా... ఆమె ఆత్మహత్య చేసుకోవడం రికార్డు కాలేదా అని అడిగితే మాత్రం నీళ్లు నములుతున్నాడు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక మరిన్ని విషయాలు తెలిసే అవకాశం వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాపింగ్ చేసి.. సినిమాకు తీసుకెళ్లి.. థియేటర్‌లో గ్యాంగ్ రేప్