Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి ఏలోకంలో వున్నా.. ప్రేమిస్తూనే వుంటా: రామ్ గోపాల్ వర్మ

''క్షణక్షణం'' చిత్రంలో శ్రీదేవి కంటతడి పెట్టిన ఫోటోను రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశాడు. అతిలోకసుందరికి వీరాభిమాని అయిన రామ్ గోపాల్ వర్మ ఆమె మరణ వార్త విని షాక్ అయ్యాడు. వరుసగా ట్వీట్లు చేస్తూ.. సోషల్ మీ

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (09:24 IST)
''క్షణక్షణం'' చిత్రంలో శ్రీదేవి కంటతడి పెట్టిన ఫోటోను రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశాడు. అతిలోకసుందరికి వీరాభిమాని అయిన రామ్ గోపాల్ వర్మ ఆమె మరణ వార్త విని షాక్ అయ్యాడు. వరుసగా ట్వీట్లు చేస్తూ.. సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఈ క్రమంలో క్షణక్షణం చిత్రంలో ఆమె ఏడుస్తున్న ఫోటోను పెట్టి .. శ్రీదేవి నువ్వెందుకు ఏడుస్తున్నావు.. నీవు చేసిన పనికి మేమే ఆ పని చేస్తున్నామని వర్మ ఆందోళన వ్యక్తం చేశారు.

తాను సినిమాల్లోకి రావడానికి ప్రధానకారణం ఆమెను అతి దగ్గర నుంచి చూడవచ్చుననే ఆశతోనేనని వర్మ ట్వీట్ చేశారు. 'క్షణక్షణం' సినిమా శ్రీదేవికి తన ప్రేమలేఖ వంటిదని తెలిపారు. 
 
అంతేగాకుండా శ్రీదేవి మరణంపై వర్మ దేవుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భగవంతుడిని తాను ఎన్నడూ ద్వేషించనంతగా ఈ దినం ద్వేషిస్తున్నానని మండిపడ్డారు. కాంతి కంటే ప్రకాశమైనది నేడు మనకు దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవి ఏలోకంలో వున్నా.. ఎప్పుడూ ప్రేమిస్తూనే వుంటానని వర్మ తెలిపారు. శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని... ఆమె భర్త బోనీ కపూర్ గురించి ఆలోచిస్తూ వర్మ ఆవేదన చెందారు. శ్రీదేవి నిజంగానే చనిపోయిందా? ఎవరైనా నన్ను నిద్రలేపి, ఇదొక పీడకల మాత్రమే అని చెప్పగలరా? అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం

కూటమి ప్రభుత్వానికి వడ్డీతో సహా చెల్లిస్తాం: వైసిపి మాజీ మంత్రి రోజా

YS Jagan: జగన్ పుట్టినరోజు బ్యానర్‌లో అల్లు అర్జున్ ఫోటో.. (వీడియో)

రీల్స్ కోసం.. శునకాన్ని ఆటోపై ఎక్కించుకుని తిరిగాడు.. (Video)

Andhra Pradesh: ఏపీలో భూప్రకంపనలు.. రెండు సెకన్ల పాటు కంపించింది.. పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments