Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరైనా సరే... మా మహేంద్ర బాహుబలి ముందు తలొంచాల్సిందే.. జోక్స్‌తో హోరెత్తుతున్న ట్విట్టర్

ఆదివారం ఓవల్‌లో జరిగిన కీలకమ్యాచ్‌లో సఫారీలను చిత్తుగా ఓడించిన టీమిండియా అభిమానుల్లో కలిగించిన జోష్ ఒకెత్తు అయితే మైదానంలో వికెట్ల మధ్య పరుగెడుతూ దక్షిణాఫ్రికా జట్టులోని కీలక బ్యాట్స్‌మెన్లు ధోనీకి చిక్కిన వైనం టీమిండియా ఫ్యాన్స్‌ని కడుపుబ్బా నవ్వించ

Advertiesment
బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరైనా సరే... మా మహేంద్ర బాహుబలి ముందు తలొంచాల్సిందే.. జోక్స్‌తో హోరెత్తుతున్న ట్విట్టర్
హైదరాబాద్ , సోమవారం, 12 జూన్ 2017 (03:13 IST)
ఆదివారం ఓవల్‌లో జరిగిన కీలకమ్యాచ్‌లో సఫారీలను చిత్తుగా ఓడించిన టీమిండియా అభిమానుల్లో కలిగించిన జోష్ ఒకెత్తు అయితే మైదానంలో వికెట్ల మధ్య పరుగెడుతూ దక్షిణాఫ్రికా జట్టులోని కీలక బ్యాట్స్‌మెన్లు ధోనీకి చిక్కిన వైనం టీమిండియా ఫ్యాన్స్‌ని కడుపుబ్బా నవ్వించింది. సెమీస్‌లోకి రాకుండా ఉండాలంటే ఇలా ఆడాలి, ఇలా క్రీజువైవుకు పరుగెత్తాలి అని ఐసీసీ సఫారీలకు దారి చూపించిందా అంటూ నెటిజన్లు సెటైర్లమీద సెటైర్లు వేస్తున్నారు. మైదానంలో టీమిండియా ఫ్యాన్స్ గోల, సంబరాల కంటే నెటిజన్లు ఆన్‌లైన్‌లో చేస్తున్న గోల, జోకులు, విసుర్లు కడుపుబ్బ నవ్విస్తున్నాయి.

మొత్తం మీద ధోనీ అంటే తమలో ఉన్న నమ్మకాన్ని నెటిజన్లు ఈ సెటైర్ల ద్వారా మరోసారి ప్రదర్శించుకున్నారు. ప్రపంచ క్రికెట్ లోని బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరైనా సరే... మా మహేంద్ర బాహుబలి ముందు తలొంచాల్సిందే అంటూ ట్విట్టర్ మారుమోగిపోతోంది. భల్లాల దేవుడు కాదు రియల్ కింగ్ మహేంద్ర బాహుబలి అని మీకు ఇప్పుడైనా అర్థమైందా..? అంటూ నెటిజన్లు ధోనీలో బాహుబలిని ఊహించుకుంటూ జోకులు షేర్ చేశారు. 
 
ఆటలోకి వస్తే.. మైదానంలో టీమిండియా, సఫారీ జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. అయితే సఫారీలు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జరిగిన కొన్ని హాస్యాస్పద సన్నివేశాలు మైదానంలో గొప్ప డ్రామాను సృష్టించాయి. వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్ జట్లలో ఒకటయిన దక్షిణాఫ్రికా జట్టు ఆదివారం ఎంత ఒత్తిడికి గురైందంటే.. ముగ్గురు కీలక బ్యాట్స్‌మెన్లు రనౌట్ కావడం సంచలనం కలిగించింది. కానీ వీటిలో డేవిడ్ మిల్లర్, డు ప్లెసిస్ మధ్య చోటు చేసుకున్న రనౌట్ వింత గొలుపుతోంది. లేని పరుగుకోసం వారు చేసిన ప్రయత్నంలో తీవ్ర గందరగోళానికి గురై క్రీజులో ఒక ఎండ్ వైపు ఇద్దరూ పరుగెత్తడం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. 
 
అప్పటికే హార్దిక్ పాండ్యా విసిరిన సూపర్ త్రోను ఒడిసిపట్టుకున్న టీమిండియా వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ మెరుపువేగంతో వికెట్లను గిరాటేసి సఫారీల కెప్టెన్ డివీలియర్స్‌ను ఔట్ చేశాడు. అతడి స్థానంలో డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. డుప్లెసిస్ బంతిని బలంగా కొట్టి పరుగుకోసం పిలిచాడు. మిల్లర్ తన స్థానం నుంచి పరుగు తీస్తూ పిచ్ మధ్యలోకి రాగానే, ప్రమాదాన్ని పసిగట్టిన డు ప్లెసిస్ మళ్లీ తానున్న క్రీజు వైపుకు పరుగెత్తాడు. ఏం జరుగుతుందో ప్రేక్షకులకు అర్థం కాకముందే ఇద్దరు బ్యాట్స్‌మన్ క్రీజులో ఒకేవైపుకు పరుగెత్తేశారు. దీంతో బంతిని అవతలి క్రీజువైపు ఫీల్డర్ విసరడం, కోహ్లీ దాన్ని అందుకుని వికెట్లు గిరాటేయడం జరిగిపోయింది. మిల్లర్ అవతలి ఎండ్  నుంచి పరుగెత్తుకొస్తూ కాస్త ఆలస్యంగా ఇవతలి క్రీజుకు చేరుకున్నాడు కాబట్టి అంపైర్ అతడినే రనౌట్ అయినట్లు ప్రకటించాడు.
 
అంతకుముందే సఫారీల కెప్టెన్ ఏబీ డివీలియర్స్ కూడా ఇలాగే లేని పరుగుకు పరుగెత్తి ధోనీకి చిక్కిపోవడం.. అంతకంటే తమాషాగా మిల్లర్, డు ప్లెసిసస్ క్రీజులో ఒకవైపుకు పరుగెత్తి ఒకరు రనౌట్ కావడం జరగ్గానే సోషల్ మీడియాలో జోకులు వెల్లువెత్తాయి. 
 
సఫారీ రనౌట్ల పాట్లను నెటిజన్లు వ్యాఖ్యలతో  ఆడుకుంటున్న తీరును ఇక్కడ చూడండి.
 
కీలకమ్యాచ్‌లో ఇలా ఆడమని సఫారీలకు ఐసీసీ చెప్పిందా..
 
పని ముగించడం ఇలా కాదేమో ప్రోతీస్
 
రనౌట్లు ఎలా కాకూడదో సఫారీలు ప్రపంచ క్రికట్‌కు రెఫరెన్సు‌ను అందించారులే..
 
క్రికెట్ ప్రపంచంలోని బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరైనా సరే... మా మహేంద్ర బాహుబలి ముందు తలొంచాల్సిందే
 
అబ్బా.. ఎంత బ్రూటల్‌గా పరుగెత్తారో మరి.
 
ఓవర్ టైమ్‌లో పనిచేస్తే ఇలాగే ఉంటుంది మరి.
 
సెలవుదినమైన ఆదివారం బలవంతంగా ఆడాల్సి వస్తే ఫలితం ఇలాగే ఉంటుంది మరి.
 
ఈరోజు వాళ్లు తమ హద్దుల్ని దాటడానికి అంత కష్టపడ్డారు మరి.
 
పరుగులు తీసేటప్పుడు మీకు దేవుడి ఆశీస్సులు దొరకలేదు కదా.
 
భల్లాల దేవుడు కాదు రియల్ కింగ్ మహేంద్ర బాహుబలి అని మీకు ఇప్పుడైనా అర్థమైందా.. ?
 
ఒక నెటిజన్ అయితే రనౌైట్ అయిన సందర్భంగా మిల్లర్, డుప్లెసిస్, ధోనీ మధ్య మాటలెలా జరిగి ఉంటాయో కూడా ఊహించి రాశాడు. ఇది జోకులకే జోకుగా పేలింది. దాన్ని ఇక్కడ చూడండి.
 
మిల్లర్: క్రీజులోకి  నేను ముందొచ్చాను.
డుప్లెసిస్: లేదు బ్రదర్, ముందు వచ్చింది నేను కదా.
ధోనీ: ఎహె.. పొట్లాట కట్టిపెట్టి ఎవరో ఒకరు ఇక బయలుదేరండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరితో అయినా పెట్టుకోండి కానీ మా ధోనితో మాత్రం పెట్టుకోవద్దు.. కోహ్లీ హెచ్చరిక