Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్... మరో చిత్రంలో కూడా...

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ దక్షిణాదిలో రెండు చిత్రాల్లో నటించనుంది. ఇందుకోసం ఒకటి టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ చిత్రంలో నటించేందుకు ఆమె సమ్మతించింది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (12:56 IST)
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ దక్షిణాదిలో రెండు చిత్రాల్లో నటించనుంది. ఇందుకోసం ఒకటి టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ చిత్రంలో నటించేందుకు ఆమె సమ్మతించింది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.
 
శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ 'ధడక్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న 'సైరాట్'కు ఇది రీమేక్‌గా వచ్చింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. అలా జాన్వీ తొలి సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో జాన్వీ... యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండకు జోడీగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఒక చిత్రం, తమిళంలో ఒక చిత్రంలో నటించబోతున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. తొలి చిత్రంతోనే తన అందంతో కుర్రకారు మనసులను దోచుకున్న జాన్వీని... తమ చిత్రాల్లో ఎంచుకునేందుకు నిర్మాతలు పోటీపడుతున్నారు. 
 
అయితే, జాన్వీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. అలాగే, విజయ్ దేవరకొండ చిత్రంలో నటించనున్నారు. అలాగే, మరో సౌతిండియా చిత్రంలో కూడా నటించనుంది. వీటిపై ఆమె వైపు నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. ప్రస్తుతం జాన్వీ చేతిలో మరో హిందీ చిత్రం ఉంది. 'తఖ్త్' అనే చారిత్రక చిత్రంలో జాన్వీ నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మించనున్నారు. కరీనా కపూర్‌, విక్కీ కౌశల్‌, ఆలియా భట్‌, రణ్‌వీర్‌ సింగ్‌, భూమి పెడ్నేకర్‌ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments