లారెన్స్ నన్ను ఏవేవో చూపించమని కోరాడు... బెల్లంకొండ విలన్... శ్రీరెడ్డి షాకింగ్ (Video)

శ్రీరెడ్డి మరో బాంబు పేల్చింది. ఈసారి లారెన్స్ పేరును బయటకు తెచ్చింది. డాన్స్ డైరెక్టర్, దర్శకుడు అయిన లారెన్స్ తనను రూమ్‌కు తీసుకెళ్లి ఏవేవో చూపించమని కోరాడని ఆరోపణలు చేసింది. తొలుత అతడి గదికి వెళ్లగ

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (12:18 IST)
శ్రీరెడ్డి మరో బాంబు పేల్చింది. ఈసారి లారెన్స్ పేరును బయటకు తెచ్చింది. డాన్స్ డైరెక్టర్, దర్శకుడు అయిన లారెన్స్ తనను రూమ్‌కు తీసుకెళ్లి ఏవేవో చూపించమని కోరాడని ఆరోపణలు చేసింది. తొలుత అతడి గదికి వెళ్లగానే రాఘవేంద్ర స్వామి ఫోటోలు, రుద్రాక్షలు చూసి వావ్ అనుకున్నాననీ, కానీ ఆ తర్వాత అతడి నిజ స్వరూపం చూపించాడని తెలిపింది.
 
తనకు లారెన్స్ వేరే స్నేహితుల ద్వారా పరిచయమయ్యాడనీ, తొలుత తను పేదవారికి ఎలా మేలు చేస్తున్నాడో వివరించిన లారెన్స్ మెల్లగా తనలో వున్న రొమాంటిక్ యాంగిల్ చూపించాడని వెల్లడించింది. మంచి మాటలు చెపుతూనే మెల్లగా నా నడుము, ఇతర శరీర భాగాలు చూపించమని అడిగాడని ఆరోపించింది. ఐతే ఈ మొత్తం వ్యవహారంలో బెల్లంకొండ సురేష్ విలన్ గా మారాడని షాకిచ్చింది. దీంతో మళ్లీ టార్గెట్ టాలీవుడ్ పైకి వచ్చేసినట్లయింది.
 
కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలు, దర్శకులపై క్యాస్టింగ్ కౌచ్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించిన శ్రీరెడ్డి తన టార్గెట్టును తమిళ ఇండస్ట్రీపైకి మళ్లించింది. నిన్న దర్శకుడు మురుగదాస్ పైన వ్యాఖ్యలు పోస్ట్ చేసిన శ్రీరెడ్డి ఈ రోజు రోజాపూలు హీరో శ్రీకాంత్ పైన దారుణమైన కామెంట్లను పోస్టు చేసింది.
 
ఐదేళ్ల క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొనేందుకు శ్రీకాంత్ వచ్చాడని తన ఎఫ్బీలో పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత తనతో అతడు ఎంజాయ్ చేశాడంటూ దారుణమైన పదజాలం వుపయోగించింది. తనతో డ్యాన్స్ చేస్తూ తనకు అవకాశం ఇస్తానని చెప్పాడని పేర్కొంది. పైగా #TamilLeaks అని ట్యాగ్ లైన్ కూడా జత చేసింది. మరి దీనిపై రోజాపూలు హీరో ఎలా స్పందిస్తాడో చూడాలి.
 
ఇదిలావుంటే ఇప్పటికే తమిళ హీరో విశాల్ శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన సంగతి తెలిసిందే. ఆమె గబుక్కున ఎవరితోనైనా లింక్ వున్నదంటూ చెప్పేస్తుందేమోనని ఆందోళన కూడా వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

Komatireddy: ఏపీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పవన్ కల్యాణ్‌తో భేటీ అవుతారా?

ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రక్షణ తయారీ కేంద్రాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments