Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ‌విష్ణు హీరోగా, ప్ర‌దీప్ వ‌ర్మ దర్శకత్వంలో ల‌క్కీ మీడియా బ్యాన‌ర్ ఫిల్మ్‌

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (13:36 IST)
విల‌క్ష‌ణ‌ క‌థ‌ల‌తో, భిన్న త‌ర‌హా చిత్రాల‌తో, అభిన‌యానికి అవ‌కాశం ఉన్న పాత్ర‌ల‌తో దూసుకుపోతున్న శ్రీ‌విష్ణు.. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా ఇంట‌రెస్టింగ్ సినిమాల‌కు సంత‌కం చేస్తూ వ‌స్తున్నారు. 'రాజ రాజ చోళ' సినిమా షూటింగ్ పూర్త‌వ‌గా, 'గాలి సంప‌త్' చిత్రం, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న టైటిల్ ఖ‌రారు చేయ‌ని సినిమా షూటింగ్‌లు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. 
 
తాజాగా, మ‌రో ఇంట‌రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు శ్రీ‌విష్ణు అంగీకారం తెలిపారు. ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ చిత్రాన్ని ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించ‌నున్నారు. 
 
ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని రోల్‌లో శ్రీ‌విష్ణు క‌నిపించే ఈ యాక్ష‌న్ ఎమోష‌న‌ల్ డ్రామా ప్రి-ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. టాప్ టెక్నీషియ‌న్లు ఈ మూవీకి ప‌నిచేస్తున్నారు.
 
హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మిగ‌తా టెక్నీషియ‌న్ల పేర్ల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. 2021 మొద‌ట్లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానున్న‌ది. 
 
సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: ప్ర‌దీప్ వ‌ర్మ అల్లూరి
ప్రొడ్యూస‌ర్‌: బెక్కెం వేణుగోపాల్‌
బ్యాన‌ర్‌: ల‌క్కీ మీడియా
సినిమాటోగ్ర‌ఫీ: శివేంద్ర‌
మ్యూజిక్‌: హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments