Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు "స్పైడర్" కలెక్షన్ల సునామీ... డిస్ట్రిబ్యూటర్లకు నిరాశే...

ప్రిన్స్ మహేష్ బాబు - దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌‌లో వచ్చిన చిత్రం 'స్పైడర్'. గత నెల 27వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఆరంభంలో నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (06:20 IST)
ప్రిన్స్ మహేష్ బాబు -  దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌‌లో వచ్చిన చిత్రం 'స్పైడర్'. గత నెల 27వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఆరంభంలో నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ టాక్‌తో ఎలాంటి సంబంధం లేకుండా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. గత ఐదు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ.102 కోట్లు వసూలు చేయడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
 
తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి భారీ అంచ‌నాల‌తో విడుద‌లైంది. ఈ సినిమా గురించి నెగెటివ్ రివ్యూలు వ‌చ్చిన‌ప్ప‌టికీ, క‌లెక్ష‌న్ల‌లో మాత్రం దూసుకెళ్తూనే ఉంది. అటు ఓవ‌ర్సీస్‌లోనూ ఈ సినిమా బాగానే వ‌సూళ్లు రాబ‌డుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజే రూ.41.50 కోట్లు వ‌సూలు చేసి అత్య‌ధికంగా వ‌సూళ్లు రాబ‌ట్టిన నాలుగో చిత్రంగా నిలిచింది. 
 
ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.52 కోట్లు, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ల్లో రూ.33 కోట్లు, ఓవ‌ర్సీస్‌లో రూ.16 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింద‌ని సినీ నిర్మాత‌ల్లో ఒక‌రైన 'ఠాగూర్' మ‌ధు వెల్లడించారు. దీంతో మొద‌టి వారాంతంలో వంద కోట్ల మార్కు దాటిన ఐదో సినిమాగా 'స్పైడ‌ర్' రికార్డు సృష్టించింది. ఇప్ప‌టివ‌ర‌కు "బాహుబ‌లి 2", "ఖైదీ నెం.150", "దువ్వాడ జ‌గ‌న్నాథం", "జై ల‌వ కుశ" సినిమాలు ఈ రికార్డు సాధించాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments