Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మెట్రో" మూవీ సాంగ్‌లో న‌టించిన గీతామాధురి

టాలీవుడ్ క్రేజీ సింగ‌ర్‌ గీతామాధురి త్వ‌ర‌లో వెండితెర ఆరంగేట్రం చేస్తోందంటూ వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ యంగ్ అండ్ డైన‌మిక్ సింగ‌ర్ న‌టించే ఆ సినిమా ఏది? అన్న ఆస‌క్తి క‌న‌బ‌రిచారంతా. ఏదైతేనేం గీత

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (16:57 IST)
టాలీవుడ్ క్రేజీ సింగ‌ర్‌ గీతామాధురి త్వ‌ర‌లో వెండితెర ఆరంగేట్రం చేస్తోందంటూ వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ యంగ్ అండ్ డైన‌మిక్ సింగ‌ర్ న‌టించే ఆ సినిమా ఏది? అన్న ఆస‌క్తి క‌న‌బ‌రిచారంతా. ఏదైతేనేం గీతామాధురి న‌టించిన సినిమా డీటెయిల్స్ వ‌చ్చేశాయి. డైన‌మిక్ సింగ‌ర్ స్టైల్‌ని ఎలివేట్ చేస్తూ కొన్ని స్టిల్స్ రిలీజ్ అయ్యాయి.
 
గీతామాధురి ఎంట్రీ ఇస్తున్న ఆ ఇంట్రెస్టింగ్‌ సినిమా 'మెట్రో'. ఇటీవ‌లే స్టార్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ ఫెంటాస్టిక్ నేరేషన్‌తో తెర‌కెక్కిన చిత్రంగా ఈ సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ర‌క్తిక‌ట్టించే ఈ చిత్రం తెలుగులోనూ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని ఆయ‌న అన్నారు. అలాంటి క్రేజీ మూవీ 'మెట్రో'లో ఓ సాంగ్‌లో గీతామాధురి త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్నారు. ఎంతో శ్రావ్యంగా సాగే ఈ మెలోడీ పాట‌ను తాను స్వ‌యంగా ఆల‌పించడ‌మే గాకుండా త‌న‌దైన శైలిలో అభిన‌యించారు. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌జ‌నీ తాళ్లూరి మాట్లాడుతూ.. 'అతి త్వ‌ర‌లోనే 'మెట్రో' తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. గీతామాధురి ఆల‌పించిన ఆ మెలోడీ సాంగ్ సినిమాకి పెద్ద అస్సెట్‌. ఈ ట్యాలెంటెడ్ సింగ‌ర్ స్వ‌యంగా పాడ‌ట‌మే గాకుండా అభిన‌యించారు. ఈ సినిమాలో అన్ని పాట‌లు సంద‌ర్భానుసారం వ‌స్తూ వేటిక‌వే ప్ర‌త్యేకంగా అల‌రిస్తాయి. ఈ రోజు గీతా మాధురికి సంబంధించిన స్టిల్స్‌ను రిలీజ్ చేస్తున్నాం' అన్నారు. 
 
స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ... 'వ‌ర్ధ‌మాన గాయ‌ని గీతామాధురి ఆల‌పించి నటించిన‌ ఈ గీతం సినిమాలో వెరీ స్పెష‌ల్‌. మేకింగ్ ప‌రంగా విజువ‌లైజేష‌న్ ప‌రంగా వండ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. క్రియేటివ్ మేకింగ్ క‌నిపిస్తుంది. ఈ సీజ‌న్‌లో పెద్ద హిట్ట‌య్యే చిత్ర‌మిది. ఇటీవ‌లే డ‌బ్బింగ్ ప‌నులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫైన‌ల్ మిక్సింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Speed Rail: విమానంతో పోటీ పడే సరికొత్త రైలు- డ్రాగన్ కంట్రీ అదుర్స్ (video)

ఇండోనేషియాలో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలా?

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments