Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో ప్రభాస్ రేటు అంతనా.. 'బాహుబలి'కి రూ.15 కోట్లు.. సుజిత్ మూవీకెంతో తెలుసా?

"బాహుబలి" చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో ప్రభాస్. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్రహీరోల్లో ప్రభాస్ ఒకరు. తన కెరీర్‌లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ "బాహుబలి"తో ప్రభాస్ వచ్చిన క్

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (15:34 IST)
"బాహుబలి" చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో ప్రభాస్. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్రహీరోల్లో ప్రభాస్ ఒకరు. తన కెరీర్‌లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ "బాహుబలి"తో ప్రభాస్ వచ్చిన క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలు త్యాగం చేశాడు. 
 
తనతోటి హీరోలంతా ఈ మూడేళ్లలో నాలుగైదు సినిమాలు చేసుకొని చేతులారా సంపాదించుకుంటుంటే ప్రభాస్ మాత్రం బాహుబలిపైనే దృష్టి పెట్టాడు. దానికి తగ్గట్టుగానే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. మరి ఈ సినిమాకు ప్రభాస్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంత అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
'బాహుబలి' సినిమాకు రూ.15 కోట్లు వసూలు చేసిన ప్రభాస్.. ఆ తర్వాత చేసే సినిమాకు ఆ రేటును డబుల్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అంటే అక్షరాలా రూ.30 కోట్లన్నమాట. ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న తొలి తెలుగు హీరో ప్రభాస్ మినహా మరెవరూ లేరు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేయబోతున్న సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రభాస్ రూ.30 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని టాలీవుడ్ టాక్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

హైదరాబాదులో దారుణం - సెల్లార్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి (video)

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments