Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందుకొచ్చిన బాధ.. అందుకే బాలీవుడ్‌ను వద్దనుకున్నాను.. రమ్యకృష్ణ

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (14:59 IST)
బాలీవుడ్‌లో బంధుప్రీతి ఎక్కువని.. తద్వారా బ్యాక్ గ్రౌండ్ లేని వారికి ఆదరణ అంతగా లభించదనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు బాలీవుడ్ గురించి ఏకిపారేస్తున్నారు. ఇందుకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణమే కారణం.

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడటం.. ఇందుకు డిప్రెషనే కారణమని తెలియరావడంతో.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై పలువురు ఆరోపణలు చేస్తున్నారు. బాలీవుడ్ బయట కనిపించేంత అందమైంది కాదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
తాజాగా దక్షిణాది సినీ పరిశ్రమలో రాణించిన హీరోయిన్ రమ్యకృష్ణ బాలీవుడ్‌పై స్పందించింది. అయితే బాలీవుడ్‌లో ఆమె ఎందుకు రాణించలేదో చెప్పుకొచ్చింది. దక్షిణాది అగ్ర హీరోలందరితో నటించిన ఆమె...హీరోలతో సమానమైన స్టార్‌డమ్‌ను ఆమె సంపాదించింది. హీరోయిన్‌గా విజయవంతమైన కెరీర్‌ను సొంతం చేసుకున్న ఆమె... ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా అదరగొడుతోంది. క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది.
 
కానీ అందం, అభినయం కలగలిసిన రమ్యకృష్ణ... హీరోయిన్‌గా బాలీవుడ్‌లో మాత్రం విజయవంతం కాలేకపోయింది. అయితే తాజాగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఫైటర్' ద్వారా రమ్య మరోసారి బాలీవుడ్ లోకి ఎంట్రీ  ఇవ్వబోతోంది.
 
ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో రమ్యకృష్ణ మాట్లాడుతూ బాలీవుడ్‌లో ఎందుకు సక్సెస్ కాలేకపోయిందో వివరించింది. బాలీవుడ్‌లో తాను నటించిన చిత్రాలు విజయవంతం కాలేకపోయాయని చెప్పింది. సినిమాలు ఫ్లాప్ కావడంతో తనకు అవకాశాలు రాలేదని తెలిపింది. ఈ కారణం వల్లే బాలీవుడ్‌కు దూరమయ్యానని... దక్షిణాదిలో మాత్రం సక్సెస్ అయ్యానని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments