సుశాంత్ సింగ్ ఆత్మహత్య.. కొమరం పులి హీరోయిన్ ఏమందంటే?

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (14:49 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో బంధుప్రీతి ఎక్కువని... ఇతరులను కొందరు ఎదగనివ్వడం లేదంటూ ఇప్పటికే కంగనా రనౌత్, తాప్సీ, శ్రద్ధాదాస్ వంటి హీరోయిన్లు ఆరోపించారు. తాజాగా 'కొమరం పులి' చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నటించిన నికీషా పటేల్ కూడా దీనిపై స్పందించింది.
 
సుశాంత్ అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులు హజరుకాకపోవడాన్ని నికీషా తప్పుపట్టింది. అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు హాజరుకాలేదనేదే తన ప్రశ్న అని అంది. లంచ్ చేస్తూ బిజీగా ఉన్నారా? అని దుయ్యబట్టింది.
 
సుశాంత్ స్టార్ వారసుడు కాదని... ఇలాంటి వారిని బాలీవుడ్‌లో ఎందుకు పట్టించుకుంటారని ప్రశ్నించింది. సుశాంత్ ఆత్మహత్యకు కారణమైన వారెవరూ అంత్యక్రియలకు హాజరుకాలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
 
ఇదిలా ఉంటే.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యను జీర్ణించుకోలేకపోయిన ఓ అభిమాని ఇటీవలే సూసైడ్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్యను తట్టుకోలేక ఓ విశాఖ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. అతడికి సంబంధించి టిక్‌టాక్‌లో వీడియోలు చూసిన విశాఖ అమ్మాయి ఆవేదనకు లోనై ఆత్మహత్య చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మల్కాపురం మండలం శ్రీహరిపురం పవన్‌ పుత్ర నగర్‌కు చెందిన సుమన్‌ కుమారి సుశాంత్‌కు అభిమాని. ఆమె పదే పదే టిక్‌టాక్‌ వీడియోలు చూస్తుండేది. కొన్ని రోజులుగా సుశాంత్‌కు సంబంధించిన వీడియోలను పదే పదే టిక్‌టాక్‌లో చూసింది. దీంతో తీవ్ర కుంగుబాటుకు గురై ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధమే యమపాశమైంది... హత్య కేసులోని మిస్టరీని ఛేదించింది...

అల్లుడుని పెళ్లి చేసుకునేందుకు అత్త ప్రయత్నం... అడ్డుకున్న కుమార్తె...

చిన్నారుల ప్రాణాలు తీసుకున్న దగ్గు మందు

మనీ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే సెలెబ్రిటీలకు రెండేళ్ల జైలు ఖాయం

ఇదేదో పేర్ని నాని చెప్పినట్లు కనబడుతోందే (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments