Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీధి కుక్కపిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ కుమారుడు..

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (17:05 IST)
Sonu sood son
కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఎంతోమంది వలసకూలీలను తమ స్వస్థలాలకు చేర్చడంతో పాటు ఆపదలో ఉన్నవారికి సహాయం చేశాడు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌. దీంతో కరోనాలో పేదలకు ఆపద్భాంధవుడిగా నిలిచాడు. ఇంకా కూడా ఆపదలో వున్నవారికి కాదనకుండా సాయం చేస్తున్నాడు. 
 
తాజాగా ఓ కుక్క పిల్లను అక్కున చేర్చుకున్నాడు రియల్‌ హీరో. జంతు ప్రేమను చాటుకున్న సోనూసూద్‌ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. మనుషులకే కాదు మూగజీవాలకు కష్టం వస్తే ఆదుకోవడంలో సోనూ ఎప్పుడూ ముందుంటాడని ప్రశంసిస్తున్నారు. 
 
'నా కొడుకు అలీబాగ్ వీధుల్లో ఒంటరిగా ఉన్న ఈ కుక్క పిల్లను దత్తత తీసుకున్నాడు. ఆ కుక్క పిల్లకు నరుటో అని పేరుపెట్టామని' సోనూసూద్‌ ట్వీట్‌ చేశాడు. తన తనయుడు కుక్కపిల్లను ఎత్తుకొని ఉండగా పక్కనే ఉండగా తీసిన ఫొటోను ట్విటర్లో పోస్ట్‌ చేశాడు. ఆ పోస్ట్‌కు ఇప్పటికే 45వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments