ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని కాల్చిచంపారు. ఈ దారుణం హత్రాస్‌లో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
నౌజర్‌పుర్ గ్రామానికి చెందిన గౌరవ్‌శర్మ అనే వ్యక్తితోపాటు మరికొందరు అదే ప్రాంతానికి చెందిన అమ్రిశ్ కుమార్ వర్మ అనే రైతు కుమార్తెను కుమార్తెను వేధించసాగారు. దీంతో వారిపై ఆ రైతు కేసుపెట్టారు. ఈ కేసు గత 2018లో నమోదైంది.
అయితే కేసు వెనక్కి తీసుకోవాలంటూ గౌరవ్‌శర్మ సహా మిగతావారు రైతును బెదిరించారు. అయినప్పటికీ అమ్రిశ్ కుమార్ వర్మ కేసు వెనక్కి తీసుకోలేదు. దీంతో అతడిపై కోపం పెంచుకున్న దుండగులు రైతు పొలం వద్ద పనిచేస్తుండగా తుపాకులతో కాల్చి హత్య చేశారు.
ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను 24 గంటల్లోగా పట్టుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడైన గౌరవ్ శర్మ సహా మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ దారుణానికి ఏడుగురు పాల్పడినట్టు సమాచారం.