Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెస్ట్ ప్లాన్ వుంది.. మీ ఇద్దరిని గోవా పంపిద్దాం.. ఏమంటారు?

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (14:35 IST)
లాక్డౌన్ సమయంలో తన భర్తతో కలిసివుండలేకపోతున్నాననీ అందువల్ల తనను పుట్టింటికి పంపించాలంటూ ఓ మహిళ చేసిన విజ్ఞప్తికి నటుడు సోనూ సూద్ దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. నా దగ్గర ఓ ప్లాన్ వుంది.. మీ ఇద్దరినీ గోవాకు పంపిద్దాం. ఏమంటావు అని ప్రశ్నించాడు. దీనికి ఆ మహిళ వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. 
 
"సోనూసూద్‌.. జనతా కర్ఫ్యూ నుంచి లాక్‌డౌన్‌-4 వరకు నేను నా భర్తతోనే ఉంటున్నాను. ఇప్పుడు అతన్ని బయటకు పంపించండి. లేదా నన్ను మా అమ్మ వాళ్ల ఇంటికి పించగలరా?. ఎందుకంటే ఇకపై నేను అతనితో కలిసి ఉండలేను" అంటూ ఆ సుష్రిమా ఆచార్య అనే మహిళ ట్వీట్‌ చేసింది. దీనిపై స్పందించిన సోనూసూద్‌ మహిళకు అదిరిపోయే సమాధానం ఇచ్చారు. 'నా దగ్గర ఓ ప్లాన్‌ ఉంది. మీ ఇద్దరిని గోవా పంపిద్దాం. ఏమంటారు' అంటూ బదులిచ్చారు. 
 
ముఖ్యంగా, పొట్టకూటి కోసం పట్టణానికి వచ్చి కరోనా కోరల్లో చిక్కుకున్న వందలాది వలస కూలీలను వారి స్వస్థలాలకు చేరవేసేందుకు సోనూసూద్‌ సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కేరళలోని ఏర్నాకులంలో చిక్కుకున్న దాదాపు 180 మంది అమ్మాయిల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి వారిని స్వస్థలానికి చేర్చారు. 
 
అలాగే, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలకు సాయం చేస్తున్న బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌కు వేలల్లో విన్నపాలు పోటెతుతున్నాయి. అందులో కొన్ని స్వస్థలాలకు చేరవేయాలని వస్తుండగా మరి కొంతమంది విచిత్ర కోరికలు కోరుతున్నారు. అలా వింతైన ప్రశ్నలు వచ్చినవాటిలో ఇదొకటి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments