Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్య కంటే గొప్ప విరాళం మరొకటి లేదు.. ప్లీజ్... బలవంత చేయొద్దు!! (video)

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (14:46 IST)
కరోనా కష్టకాలంలో అందరికీ ఆపద్బాంధవుడుగా మారిని రియల్ హీరో సోనూ సూద్. కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకున్నాడు. ఈ వెండితెర విలన్.. నిజజీవితంలో చేసిన సాయానికి దేవుడితో సమానంగా చూస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం దేశంలోని సెలెబ్రిటీల్లో సోనూ సూద్ రియల్ హీరోగా మారిపోయాడు. 
 
ఈ క్రమంలో తాజాగా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకు ఆయన ఓ విజ్ఞప్తి చేశాడు. ఫీజులు కట్టాలని విద్యార్థులను బలవంతం చేయవద్దని కోరాడు. 'పేద విద్యార్థులు ఫీజు డిపాజిట్ చేయనందుకు ఆన్‌లైన్ క్లాసులను నిలిపివేయకండి. ఫీజు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వండి. మీరు చేసే ఆ చిన్న సాయం ఎంతో మంది పిల్లల భవిష్యత్‌ను కాపాడుతుంది. వాళ్లను మంచి మనుషులుగా చేస్తుంది' అని సోనూ ట్వీట్ చేశాడు. 
 
ఇక మరో ట్వీట్ లో 'విద్య కంటే గొప్ప విరాళం మరొకటి లేదు. ఫీజుల కోసం చదువుకునే విద్యార్థుల హక్కును హరించవద్దు అని సోనూసూద్ ట్వీట్ చేశాడు. సోనూసూద్ ట్వీట్ చేసిన 30 నిమిషాల్లో, ఈ పోస్ట్‌ను 10,000 మందికిపైగా లైక్ చేయగా, 500 మంది కామెంట్స్ చేశారు. ఇక 2000 మందికి పైగా రీట్వీట్‌లు చేసారు. 
 
అయితే, ఈ ట్వీట్‌కు ముందు సోనూసూద్‌ని ఒక అమ్మాయి సహాయం కోరింది. తాను చాలా పేదరాలునని, ఫీజు కూడా చెల్లించలేనని పరిస్థితి తనది అని వెల్లిడించింది. అయితే చదువుకోవాలనే కోరిక తనలో చాలా ఉందని, దానికి సహాయం కావాలని సోనూసూద్ ని సహయం కోరింది. ఈ క్రమంలో సోనూసూద్ ఈ పోస్ట్ చేశాడు.

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments