Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ళ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తా : సోను సూద్

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (15:21 IST)
వెండితెర విలన్ సోను సూద్ రియల్ హీరోగా మారి కోట్లాది మంది ప్రజలతో శభాష అనిపించుకున్నారు. ముఖ్యంగా, కరోనా లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం సైతం చేయలేని సాయాన్ని ఆయన చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో రియల్ హీరో, దేవుడుగా మిగిలిపోయాడు. అయితే, ఈయన రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, కాంగ్రెస్ లేదా ఆప్ పార్టీల్లో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై ఆయన ఎన్నడూ స్పందించలేదు. 
 
కానీ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. మరో ఐదేళ్ళ తర్వాత తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఇప్పుడు సామాజిక సేవలో నిమగ్నమై ఉన్నందున కొంత సమయం పడుతుందని సోనూసూద్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 
 
తన సోదరి మాళవిక ఎన్నికపై సోనూ సూద్ స్పందిస్తూ, తమ కుటుంబం మోగా నియోజకవర్గంతో చాలా కాలంగా నిమగ్నమై ఉందని, తన తల్లి నిరుపేదలకు విద్యను అందించిందని, తన కుటుంబం ఈ ప్రాంతంలో అనేక విద్యా సౌకర్యాలను ఏర్పాటు చేసిందని సోనూ సూద్ గుర్తుచేశారు. కాగా,సోనూ సూద్ సోదరి పంజాబ్‌లో కాంగ్రెస్ తరపున ఎన్నికలకు పోటీ చేస్తుండగా, ఆమె తరపున సోనూ ప్రచారంలో చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KCR: జీవితంలో తొలిసారి అమెరికాకు కేసీఆర్.. ఎందుకో తెలుసా?

Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు.. చివరికి?

జమిలి ఎన్నికల బిల్లు.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయ్- చంద్రబాబు

స్కూలుకు వెళ్లే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి కట్టేసి పెళ్లి చేసేసారు (video)

Anna Canteens: నగరాల్లో కాదు.. గ్రామాలకు చేరనున్న అన్న క్యాంటీన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments