Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్ ఐఎ.ఎస్‌. కోచింగ్ ఫౌండేష‌న్ ఆ త‌ర్వాత అదేనా?

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (20:46 IST)
సోనూసూద్ సైలెంట్‌గా త‌న‌ప‌ని తాను చేసుకుంటూ పోతున్నాడు. క‌రోనా స‌మ‌యంలో దేశంలో త‌లెత్తిన వ‌ల‌స కూలీల బాధ‌లు, వారి జీవితాలు, ప్ర‌జ‌ల ఆరోగ్యం ఇలా ప్ర‌తిదానిమీద ఫోక‌స్ పెట్టి సోనూసూద్ దేశ ప్ర‌జ‌ల‌లో హీరోగా నిలిచాడు. అస‌లు ఒక్క‌డే ఇన్ని మంచి ప‌నులు చేస్తుంటే దేశ నాయ‌కులు రాష్ట్ర పాల‌కులు ఏం చేస్తున్నార‌నేది కామ‌న్‌మేన్ మ‌దిలో వుండే క్వ‌శ్చ‌న్‌. ఒక వేళ సోనూసూద్ ఒక్క‌డే ఇవ‌న్నీ చేయ‌గ‌ల‌డా? ఆయ‌న వెన‌కాల ఎన్‌.ఆర్‌.ఐ.కు చెందిన కొంత‌మంది పెద్ద‌ల స‌పోర్ట్ వుంద‌నీ కొంద‌రంటే దేశంలో బ‌డానాయ‌కుల అండ వుంద‌ని ర‌క‌ర‌కాలుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు కూడా వ‌చ్చాయి. కానీ. చేసేది మంచి ప‌ని క‌నుక దానికి ఎవ్వ‌రూ రియాక్ట్ కాలేదు. ఇన్ని మంచి ప‌నులు ఒక్క‌డే చేస్తే దేశాన్ని పాలించేవారు త‌ల‌చుకుంటే ఇంకెంత చేయ‌గ‌ల‌ర‌నేది ప్ర‌శ్న‌ను నెటిజ‌న్లు వేశారు.
 
అయితే తాజాగా మ‌న దేశంలో కొన్ని వ్య‌వ‌స్థ‌లు బాగా లేవ‌నీ, వాటిని మార్చాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంద‌ని ఓ సంద‌ర్భంలో సోనూసూద్ రియాక్ట్ అయ్యాడు. ఇది ఎన్నో కోట్ల‌మందిలో వున్న ప్ర‌శ్నే. అలా అలా అన్ని మంచి ప‌నులు చేస్తూనే ఇప్పుడు తాజాగా విద్యావిధానంపైన కూడా క‌న్నేశాడు సోనూసూద్‌. తాజాగా ఐ.ఎ.ఎస్‌. చ‌ద‌వాల‌నే ఔత్సాహికుల‌కు ఉచిత కోచింగ్ ఇవ్వ‌నున్న‌ట్లు ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశాడు. దానికి సంబంధించిన పేర్ల‌ను వివ‌రాల‌ను సూద్ చారిటీ ఫౌండేష‌న్‌.ఓఆర్‌జి.లో రిజిష్ట‌ర్ చేసుకోవాల‌ని సూచించారు. దివ్య‌పేరుతో ఢిల్లీకి చెందిన ఓ సంస్థ‌తో త‌ను ఈ కార్య‌క్ర‌మాలు చేయ‌నున్నాడు. ఇది చూశాక నెటిజ‌న్లు ఆయ‌న్ను అభినందిస్తున్నారు. 
 
దేశం బాగుప‌డాలంటే విద్యావిధానం మారాలి అని మేథావులు ఎప్పుడో చెప్పారు. మ‌రి ఆ విధానాన్ని సోనూసూద్ మారుస్తారా! అంటూ కామెంట్ చేస్తున్నారు. దేశంలో ఇప్ప‌టికే ఐ.ఎ.ఎస్‌. కోచింగ్‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు కూడా ఇలానే శిక్ష‌ణ ఇచ్చిన సంస్థ‌లు చాలా వున్నాయి. మ‌రి సోనూది ప్ర‌త్యేకం కాబ‌ట్టి ఇది మ‌రింత పాపుల‌ర్ అవుతుంది. మ‌రి ఇన్ని మంచి ప‌నులు చేస్తుంటే పాల‌కులు చేయ‌డానికి ఇంకేం ప‌నుంద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే సోనూసూద్ రాజ‌కీయాల్లోకి వ‌స్తారేమో అని నెటిజన్లు వాయిస్ వినిపిస్తున్నారు. మ‌రి ముందు ముందు ఆయ‌న ఎటువైపు ప‌య‌నిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆటో నడుస్తుండగానే రిపీర్ చేశాడు.. వీడియో వైరల్ (video)

జగన్ - అదానీల విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి : వైఎస్ షర్మిల

బోరుగడ్డ అనిల్‌ రాచమర్యాదలకు రూ.5 లక్షలు

రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments