Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ కరోనా పేషెంట్‌కు ఆక్సిజన్.. సోనూసూద్ అదుర్స్

Webdunia
శనివారం, 22 మే 2021 (10:50 IST)
కరోనా అయినా కాటు వేసి వేసి అలిసిపోతుందేమో గాని.. సోనూ సూద్ మాత్రం సాయం చేయడంలో ఎలాంటి అలసట చూపించడం లేదు. రోజురోజుకు ప్రజల మనసుల్లో సోనూ సూద్ స్థానం పెరిగిపోతుందే గాని తరిగిపోవటం లేదు. తాజాగా హైదరాబాద్‌లో ఓ కరోనా పేషెంట్‌కు ఆక్సిజన్ సిలిండర్ పంపి వారిని ఆదుకున్నాడు సోనూ సూద్.
 
పేద, ధనిక, కుల, మత, ప్రాంయ బేధాలు లేకుండా ఏ రాష్ట్రమైనా.. ఏ గ్రామమైనా సరే ఎవరైనా సాయం కావాలని అడిగితే.. కాదు లేదు కుదరదనకుండా సోనూ... తన చేతనైన సాయం చేస్తాడు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ కరోనా బాధితుడి ఇంటికి నేరుగా ఆక్సిజన్‌ సిలిండర్‌నే పంపారు. 
 
నల్లకుంటకు చెందిన రాఘవ శర్మ(75) అనే వ్యక్తి ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయన హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. రాఘవ శర్మలో ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోగా సాయం చేయాలంటూ అతడి కొడుకు లక్ష్మినారాయణ ట్విట్టర్‌ ద్వారా సోనూ సూద్‌ను కోరారు. ఈ ట్వీట్‌కు స్పందించిన స్పందించిన సోనూసూద్‌ తన చారిటీ ఫౌండేషన్‌ ద్వారా ఏకంగా ఆక్సిజన్‌ యంత్రాన్ని ఇంటికి పంపించాడు. 
 
గురువారం రాత్రి బతుకమ్మకుంట గోకుల్‌ స్వీట్‌ షాప్‌ ఎదురు వీధిలో ఉన్న రాఘవ శర్మ ఇంటికి కొరియర్‌ ప్రతినిధి వెళ్లి వారికి ఆక్సిజన్‌ మిషన్‌ అందజేయడంతో రాఘవ కుటుంబ సభ్యులు సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ విషయం తెలిసిన సోనూసూద్ అభిమానులు, నెటిజన్లు ఆయనపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments