Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌వ‌ర‌స భ‌రితంగా పాట‌లు

Webdunia
బుధవారం, 14 జులై 2021 (16:07 IST)
Navarasa-surya
తొమ్మిది క‌థ‌ల స‌మాహారంగా రూపొందుతూ ప్రారంభం నుంచి అంద‌రిలో ఆస‌క్తి క‌లిగించిన అంథాల‌జీ ‘న‌వ‌ర‌స‌’. ఏస్ డైరెక్టర్‌ మ‌ణిర‌త్నంతో పాటు ప్రముఖ రైట‌ర్, ఫిల్మ్ మేక‌ర్ జ‌యేందర్‌ పంచ‌ప‌కేశ‌న్ స‌మ‌ర్పణలో రూపొందిన ఈ అంథాలజీ ఆగస్ట్‌ 6న ప్రముఖ డిజిటల్‌ మాధ్యమం 'నెట్‌ఫ్లిక్స్‌'లో విడుదలవుతుంది. మాన‌వ జీవితంలోని భావోద్వేగాలు తొమ్మిది. వీటిని న‌వ‌ర‌సాలు అని కూడా అంటాం.  (కోపం, ధైర్యం, క‌రుణ‌, అస‌హ్యం, భ‌యం, వినోదం, ప్రేమ‌, శాంతి, ఆశ్చ‌ర్య‌పోవ‌డం) వీటి ఆధారంగా ‘న‌వ‌ర‌స‌’ రూపొందింది. 
 
ఇటీవ‌లే విడుదలైన టీజర్ అందులోని నటీనటులు, సాంకేతిక నిపుణులు కాంబినేషన్‌ ఈ అంథాలజీపై చాలా ఆసక్తిని పెంచింది. ఈ అంథాలజీ నుంచి 'తూరీగ..' అనే సాంగ్‌ను విడుదల చేశారు. సూర్య, ప్రయాగ రోస్‌ మార్టిన్‌ ప్రధాన తారాగణంగా  'నవరస'లో ప్రేమ అనే భావోద్వేగంపై రూపొందించిన 'గిటార్‌ కంబిమేల నిండ్రు' అనే పార్ట్‌ నుంచి ఈ రొమాంటిక్‌ సాంగ్‌ విడుదలైంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటకు మదన్‌ కార్కి సాహిత్యాన్ని అందించారు. దీన్ని గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ తెరకెక్కించారు. 
 
కొవిడ్‌ కారణంగా సినీ పరిశ్రమ ఎంతో దెబ్బతిన్నది. తమ పరిశ్రమలోని 12000 మందికి తమ వంతు సాయాన్ని అందించడానికి కోలీవుడ్‌ పరిశ్రమ ఒక్కటిగా నిలబడి చేసిన ప్రయత్నమే 'నవరస' అంథాలజీ. ఇండస్ట్రీ టాలెంట్‌, క్రియేటివిటీకి నవరస నిదర్శనంగా నిలవనుంది. భూమిక ట్రస్ట్‌ ద్వారా మేం చేయనున్న ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. ఆగస్ట్‌ 6న విడుదలవుతున్న ఈ అంథాలజీని 190 దేశాల్లో ప్రేక్షకులు నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా  వీక్షించనున్నారు.

సంబంధిత వార్తలు

2024 టీడీపి నో మోర్, జనసేన పరార్, రోజా ఇలా అనేశారేంది రాజా? (video)

మాజీ సీఎం జగన్ తాడేపల్లి ఇంటి ముందు రోడ్డు ద్వారా Live View (video) చూసేద్దాం రండి

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments