Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళసూత్రాన్ని చేతికి ధరిస్తానంటున్న బాలీవుడ్ నటి.. ఎవరు?

మంగళసూత్రాన్ని మెడలో వేసుకుంటే భర్త హృదయానికి దగ్గరగా ఉంటారన్నది భారతీయ స్త్రీల నమ్మకం. కానీ, బాలీవుడ్ నటి మాత్రం తద్విరుద్ధంగా నడుచుకుంటోంది. అగ్నిసాక్షి తన మెడలో భర్త కట్టిన తాళిని ఆ బాలీవుడ్ నటి చే

Webdunia
బుధవారం, 30 మే 2018 (10:38 IST)
మంగళసూత్రాన్ని మెడలో వేసుకుంటే భర్త హృదయానికి దగ్గరగా ఉంటారన్నది భారతీయ స్త్రీల నమ్మకం. కానీ, బాలీవుడ్ నటి మాత్రం తద్విరుద్ధంగా నడుచుకుంటోంది. అగ్నిసాక్షి తన మెడలో భర్త కట్టిన తాళిని ఆ బాలీవుడ్ నటి చేతికి కట్టుకుని తిరుగుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటివారివల్లే భారతీయ సంప్రదాయం నాశనమైపోతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇంతకీ ఆ బాలీవుడ్ నటి ఎవరన్నదే కదా మీ సందేహం... ఆమె ఎవరో కాదు.. సోనమ్ కపూర్. ఈమె వివాహం ఇటీవలే ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్‌ అహూజాతో అత్యంత వైభవంగా జరిగింది. పంజాబీ స్టైల్‌లో జ‌రిగిన వీరి వివాహ వేడుక‌కి బాలీవుడ్ తారాగ‌ణం మొత్తం త‌రలి వ‌చ్చింది. సోన‌మ్ న‌టించిన "వీరే ది వెడ్డింగ్" చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుండ‌గా ప్ర‌స్తుతం ప్రమోష‌న్స్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంది. 
 
అయితే ప్ర‌మోష‌న్ కార్య‌క్రమాల‌లో డిఫ‌రెంట్ డ్రెస్సింగ్స్‌లో క‌నిపిస్తున్న సోన‌మ్ ఎక్క‌డికి వెళ్లిన మంగ‌ళ సూత్రాన్ని చేతికి క‌ట్టుకొని వెళుతుంద‌ట‌. దీంతో నెటిజ‌న్స్ మండిప‌డుతూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు కామెంట్స్ పెడుతున్నారు. 
 
సోన‌మ్ భార‌తీయ సంప్ర‌దాయాన్ని మంట గ‌లుపుతుంద‌ని కొంద‌రు నెటిజ‌న్స్ ఆమెపై మండిప‌డుతున్నారు. పెళ్లైన ప్ర‌తీ మ‌హిళ మంగ‌ళ‌సూత్రం వేసుకోవాల‌నే నిమ‌యం లేక‌పోయిన‌, మ‌నం పెట్టుకున్న కొన్ని క‌ట్టుబాట్లు ఆచార వ్య‌వ‌హారాలు పాటించాల్సిందేనంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
 
బాలీవుడ్‌ సెలబ్రిటీలు విదేశీ సంప్రదాయానికి అలవాటు పడి మన సంప్రదాయాన్ని అవమానపరుస్తున్నారు. భారతీయ సంప్రదాయాన్ని విదేశీ సంప్రదాయంలో కలిపేస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గతంలో కూడా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కూడా త‌న చేతికి మంగ‌ళ‌సూత్రం ధ‌రించి విమ‌ర్శ‌ల పాల‌ైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం : చెవిరెడ్డికి బాలినేని సవాల్

బంగాళాఖాతంలో మరింతగా బలపడిన వాయుగుండం.. దిశ మారుతుందా?

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments