Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోహెల్ నటిస్తున్న బూట్‌ కట్ బాలరాజు’ నుంచి మ్యాసియస్ట్ టైటిల్ ట్రాక్ విడుదల

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (07:22 IST)
Boot Cut Balaraju song
‘బిగ్‌‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
 
బ్లాక్ బస్టర్ ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రం కోసం చార్ట్ బస్టర్ ఆల్బమ్ ను కంపోజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన రాజు నా బాలరాజ, తాగుదాం తాగి ఆగుదాం పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం టైటిల్ సాంగ్ 'రింగు రింగు బిళ్ళ' ను విడుదల చేశారు మేకర్స్.
 
భీమ్స్ సిసిరోలియో రింగు బిళ్ళ పాట కోసం మాస్ అండ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ నెంబర్ ని కంపోజ్ చేశారు. భోలే షావలి, రఘురాం ఈ పాటని అద్భుతంగా అలపించారు. దేవ్ పవార్ రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఆస్కార్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు అందించిన కొరియోగ్రఫీ మరో ఆకర్షణగా నిలిచింది. సోహెల్ చేసిన మాస్ డ్యాన్స్ మూమెంట్స్ గ్రేస్ ఫుల్ అండ్ ఫెంటాస్టిక్ గా వున్నాయి. డైనమిక్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించారు సోహెల్.
 
ప్రముఖ డీవోపీ శ్యామ్ కె నాయుడు అందించిన కలర్ ఫుల్, లైవ్లీ విజువల్స్ మాస్ వైబ్ ని మరింతగా ఎలివేట్ చేశాయి. ఈ చిత్రానికి విజయ్ వర్ధన్ ఎడిటర్ కాగా విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్.
 
నటీనటులు: సయ్యద్ సోహెల్ ర్యాన్, మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ, అవినాష్, సద్దాం, ‘కొత్త బంగారు లోకం’ వివేక్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments