Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివకార్తికేయన్‌ లేడీ గెటప్‌ అదుర్స్‌...

24 ఎ.ఎం.స్టూడియోస్‌ బ్యానర్‌పై ఆర్‌.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్న చిత్రం 'రెమో'. శివకార్తీకేయన్‌, కీర్తి సురేష్‌ హీరో హీరోయిన్లుగా నటించి

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (20:10 IST)
24 ఎ.ఎం.స్టూడియోస్‌ బ్యానర్‌పై ఆర్‌.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్న చిత్రం 'రెమో'. శివకార్తీకేయన్‌, కీర్తి సురేష్‌ హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం రెమోను తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. బక్కియ రాజ్‌ కన్నన్‌ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, సాంగ్‌ రిలీజ్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం జరిగింది. ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. సాంగ్‌ను వంశీపైడిపల్లి విడుదల చేశారు. 
 
అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ... శివకార్తీకేయన్‌ సినిమాలు ఇప్పటివరకు తెలుగులో రీమేక్‌ అవుతూ వచ్చేవి. కానీ తొలిసారి రెమో సినిమాను తెలుగులో డబ్‌ చేసి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ వేసిన లేడీ గెటప్‌ చూసిన నేను వెరవరో హీరోయిన్‌ అనుకున్నాను. శివకు లేడీ గెటప్‌ అంతబాగా సరిపోయింది. ఈ సినిమాతో తెలుగులోకి ఎంటర్‌ అవుతున్న శివకార్తికేయన్‌ ఖచ్చితంగా రాణిస్తాడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే దిల్‌రాజు సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా రాణిస్తున్నారని అన్నారు.
 
దిల్‌ రాజు మాట్లాడుతూ... నేను 'శతమానం భవతి' అవుట్‌డోర్‌ షూటింగ్‌లో ఉన్నప్పుడు రాజా రవీంద్ర 'రెమో' తమిళ ట్రైలర్‌ చూపించాడు. ట్రైలర్‌ చూడగానే నాకు నచ్చింది. నిర్మాతగా నేను ఇప్పుడు 25వ సినిమా చేశాను. ఇప్పటివరకు ఏ సినిమాను రీమేక్‌ చేయలేదు. కానీ తొలిసారి రెమో ట్రైలర్‌ చూసి రీమేక్‌ చేయాలనిపించేంతగా ప్రేరణ పొందాను. నాలాగే నిర్మాత రాజాను మరికొందరు రీమేక్‌ కోసం అప్రోచ్‌ అయ్యారు. అయితే మాల మేడం సపోర్ట్‌తో రాజాగారు నన్ను వచ్చి కలిసి ఈ సినిమాను తెలుగులో డబ్‌ చేసి నా బ్యానర్‌లో విడుదల చేయాలనుందని అనడంతో నేను కూడా హ్యాపీగా సరేనన్నాను. 
 
ఎందుకంటే ఈ సినిమాను నేను ఒక్కడినే ప్రివ్యూ షో వేసుకుని చూసినప్పుడు బాగా ఎంజాయ్‌ చేశాను, కానీ నాకు ఎక్కడో డౌట్‌ వచ్చింది, దాని వల్ల వెట్రి థియేటర్‌లో ఆడియెన్స్‌ మధ్య సినిమా చూశాను. ఆడియెన్స్‌ కూడా సినిమాను బాగా ఎంజాయ్‌ చేయడం చూసి నాలో నమ్మకం ఏర్పడింది. శంకర్‌ 'వైశాలి' సినిమాను తెలుగులో డబ్‌ చేసి విడుదల చేశాను. తర్వాత మణిరత్నంగారి 'ఓకే బంగారం' కూడా నా బ్యానర్‌లో విడుదల చేశాను. ఇప్పుడు నా బ్యానర్‌లో విడుదల వుతున్న రెమో నాకు హ్యాట్రిక్‌ హిట్‌ మూవీ అవుతుందని భావిస్తున్నాను.   తమిళనాడులో 65 నుంచి 70 కోట్లు కలెక్ట్‌ చేయడం చిన్న విషయం కాదని అన్నారు.
 
అనిరుధ్‌ మాట్లాడుతూ... రెమో తెలుగులో నాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ మంచి మూవీ అవుతుందని భావిస్తున్నాను. ఈ చిత్రం ద్వారా తెలుగులో పరిచయం అవుతున్న శివకార్తికేయన్‌ను ప్రేక్షకులు ఆశీర్విదించాలి. సాంగ్స్‌, సినిమాను పెద్ద హిట్‌ చేస్తారని భావిస్తున్నానని అన్నారు. పి.సి.శ్రీరాం మాట్లాడుతూ... తెలుగు, తమిళ సినిమాలు నాకు రెండు కళ్ళులాంటివి. రెండు భాషా చిత్రాలతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను తెలుగులో చేసిన సినిమాలు తమిళంలోకి డబ్‌ అయ్యాయి. అలాగే తమిళ సినిమాలు తెలుగులోకి డబ్‌ అయ్యాయి. రెమో సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారించాలని కోరుకుంటున్నాను' అన్నారు.
 
శివకార్తికేయన్‌ మాట్లాడుతూ... దిల్‌రాజు బ్యానర్‌లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు ఆ సినిమాకు నేను బాగా కనెక్ట్‌ అయ్యాను. దిల్‌రాజుగారి బ్యానర్‌ ద్వారా తెలుగులో ఎంట్రీ ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమాను ఓ పరీక్షలా భావిస్తున్నాం. అయితే దిల్‌ రాజు వంటి నిర్మాత టీచర్‌గా ఉండటం వల్ల ఈ రెమో ఎగ్జామ్‌ను మేం అందరం తెలుగులో పాస్‌ అవుతామని భావిస్తున్నానని అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

లింగ మార్పిడి చేయించుకుంటే పెళ్లి చేసుకుంటా..... ఆపై ముఖం చాటేసిన ప్రియుడు..

KCR: యశోద ఆస్పత్రిలో కేసీఆర్.. పరామర్శించిన కల్వకుంట్ల కవిత

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో తెలుగు మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments